
అభిలాష్, రోహీ నయన్ జంటగా రూపొందిన చిత్రం ‘సిన్స్ 1975’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో బెల్లాన అప్పారావు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. బెల్లాన అప్పారావు మాట్లాడుతూ– ‘‘ఒకప్పటి టాప్ గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా సురేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. సురేంద్ర మాట్లాడుతూ– ‘‘నిజజీవిత గ్యాంగ్‌స్టర్ కథతో తెరకెక్కించాం కాబట్టి సహజంగా ఉండాలని కొత్తవారిని నటింపజేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, సహనిర్మాతలు: గడ్డం శిరీష, నల్లపు రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్ బాబు అట్లూరి.
Comments
Please login to add a commentAdd a comment