బర్త్‌డేకి థండర్‌ | BoyapatiRAPO First Thunder release date locked | Sakshi
Sakshi News home page

బర్త్‌డేకి థండర్‌

Published Sun, May 14 2023 5:47 AM | Last Updated on Sun, May 14 2023 5:47 AM

BoyapatiRAPO First Thunder release date locked - Sakshi

‘‘ఫస్ట్‌ థండర్‌ రానుంది.. రెడీగా ఉండండి’ అంటూ రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం గురించి యూనిట్‌ పేర్కొంది.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

కాగా రామ్‌ పుట్టినరోజు (మే 15) సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఫస్ట్‌ థండర్‌’ పేరుతో ప్రత్యేకంగా ఓ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించి, శనివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘యాక్షన్, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 20న అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. రామ్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్‌ డిటాకే, సమర్పణ: జీ స్టూడియోస్, పవన్‌కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement