
రామ్‌చరణ్
సవాల్ విసిరే సత్తాతో పాటు సంప్రదాయాలకు విలువిచ్చే పవర్‌ఫుల్ కుర్రాడు రామ్ కొణిదెల. ఇక్కడున్న ఫొటో చూస్తే అర్థం అవుతుందిగా.. ఎంత వినయంగా కనిపిస్తున్నాడో కదూ. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘రామ్‌చరణ్–బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ సినిమాకి ‘వినయ విధేయ రామ’ టైటిల్ అనౌన్స్ చేయగానే మంచి స్పందన వచ్చింది.
టీజర్‌లకు కూడా మంచి స్పందన లభిస్తోంది. సక్సెస్‌ఫుల్‌గా టాకీ పార్టును కంప్లీట్ చేశాం. వచ్చే నెల 10 నుంచి హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీకరించబోతున్నాం. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత దానయ్య. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, వివేక్ ఒబెరాయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment