sankar rao
-
‘లోకేష్‌ను అందుకే పప్పు అంటారు.. ఇప్పుడు అర్థమవుతోంది’
సాక్షి, గుంటూరు: లోకేష్‌ను పప్పు అని ఎందుకు అంటున్నారో అర్థమవుతోందని, ఆయన ఓ అయోమయంలా తయారయ్యాడంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నంబురు శంకరరావు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో లోకేష్ చెప్పాలని, 2400 కోట్లతో అభివృద్ధి చేశామని లోకేష్ అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. ‘‘టీడీపీ నేతలను ప్రజలంతా ఛీ కొడుతున్నారు. లోకేష్‌ను పప్పు అని ఎందుకు అంటున్నారో అర్థమవుతోంది. లోకేష్.. ఓ అయోమయంలా తయారయ్యాడు. లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రైతుల గురించి టీడీపీ ఏనాడైనా ఆలోచించిందా?. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు, లోకేష్‌ది’’ అంటూ మండిపడ్డారు. ‘‘లోకేష్ పాదయాత్రకు సభకు మద్యం చీరలు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారు. చంద్రబాబు లోకేష్ జనానికి చెప్పాలి. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ బహిరంగ చర్చకు రావాలి. నేను 400 ఎకరాలు అటవీ భూమి ఆక్రమించుకుని వెంచరేశానని లోకేష్ చెప్తున్నాడు. దమ్ముంటే ఆ ల్యాండ్ ఎక్కడుందో చూపిస్తే పేదలకు పంచుతాను’’ అంటూ ఎమ్మెల్యే శంకరరావు సవాల్ విసిరారు. చదవండి: Fact Check: వాస్తవాలు తెలిసి కూడా ‘ఈనాడు’ అబద్ధాలు -
సౌదీలో జిల్లా వాసి ఆత్మహత్య
సంతబొమ్మాళి: నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబంతో సంతోషంగా గడపాలని బతుకుదెరువుకు విదేశాలకు వెళ్లాడు. అనారోగ్య సమస్యల కారణంగా అక్కడే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన బత్సల శంకరరావు (38) గత ఏడాది మార్చిలో సౌదీ అరేబియా వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో వెల్డింగ్ పని చేస్తున్నాడు. నెల రోజుల నుంచి కిడ్నీ, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడంతో స్వదేశానికి రావాలని ప్రయత్నించాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల కారణంగా రావడానికి వీలులేకుండా పోయింది. దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ నెల 15న ఆస్పత్రిలో చేరి కరోనా, ఇతర పరీక్షలు చేయించుకున్నాడు. తర్వాత ప్రత్యేక రూమ్‌లో ఉంచడంతో మరింత మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ నెల 16, 17 తేదీల్లో బంధువులకు ఫోన్ చేసి అనారోగ్య సమస్యల కారణంగా చనిపోతానని చెప్పాడు. అలాంటి పని చేయవద్దని, త్వరలోనే లాక్డౌన్ ఎత్తివేస్తారని, స్వదేశానికి వచ్చేయవచ్చని బంధువులు భరోసా కల్పించారు. అయినా ఒత్తిడికిలోనై గురువారం రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. భర్త మరణవార్త విని భార్య కుసుమ, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు, జిల్లా అధికారులకు కుటుంబ సభ్యులు కోరారు. -
వనవాసం రెడీ
నవీన్‌రాజ్ శంకరాపు, శశికాంత్, బందెల కరుణశ్రావ్య, శృతి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం వహించారు. శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ పతాకంపై సంజయ్ కుమార్.బి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ కుమార్.పి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌లాగానే సినిమా కూడా ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మేము అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు సంజయ్ కుమార్.బి. -
15న కలెక్టరేట్ల ఎదుట బీసీల రిలేదీక్షలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాలకు నిరసనగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు ఈ నెల 15న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు శనివారం తెనాలిలో పిలుపునిచ్చారు. బీసీ కులాల వారు పెను ప్రమాదంలో ఉన్నారని, పార్టీలకతీతంగా బీసీలు ఏకమై ఉద్యమానికి మద్దతుగా రిలే దీక్షలు చేపట్టి, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన సూచించారు. కాపుల సామాజిక, ఆర్ధిక పరిస్థితులపై నిష్పక్షపాతంగా సమగ్రమైన శాస్త్రీయ సర్వే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల్లో అభద్రతా భావాన్ని తొలగించడానికి బీసీ సంఘ నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చలు జరపాలని కోరారు. ముఖ్యమంత్రి స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, తరువాతి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని శంకరరావు హెచ్చరించారు. -
ఓడిపోయిన రాజకీయ ప్రముఖుల కుమార్తెలు!
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో బీజేపీ, టీడీపీలకు చావుదెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. రాజకీయ ప్రముఖుల కుమార్తెలు ఓడిపోయారు. కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జీ.సాయన్న,కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి శంకర్రావు కుమార్తెలు ముగ్గురూ ఓడిపోయారు. 4వ వార్డు పికెట్‌లో పోటీ చేసిన ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితపై 844 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 8 వార్డులకు 114 మంది పోటీ చేశారు. నాలుగు టీఆర్ఎస్, రెండు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. మిగిలిన రెండిటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు. 1వ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వరరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్‌పై 616 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 3 వార్డు కార్ఖానాలో టీఆర్ఎస్ అభ్యర్ధి జంపన విద్యావతిపై 2500 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయం సాధించారు. వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు 1వ వార్డు మహేశ్వర రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) 2వ వార్డు కేశవరెడ్డి (టీఆర్ఎస్) 3వ వార్డు అనితా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబల్ ) 4వ వార్డు నళినీ కిరణ్ (టీఆర్ఎస్) 5వ వార్డు మారేడ్‌పల్లి రామకృష్ణ (ఇండిపెండెంట్) 6వ వార్డు పాండు యాదవ్ (టీఆర్ఎస్) 7వ వార్డు తిరుమలగిరి భాగ్యశ్రీ(కాంగ్రెస్) 8వ వార్డు బొల్లారం లోకనాథం (టీఆర్ఎస్) -
'అంబేద్కర్ విగ్రహాన్ని అందవికారంగా చేశారు'
గుంటూరు : అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని అంద వికారంగా రూపకల్పన చేశారని తెలుగు కవి, దళితవాద ఉద్యమకారుడు కత్తి పద్మారావు అన్నారు. దళితులపై వివక్ష చూపడానికి ఇదే నిదర్శనమని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. 40 రోజుల్లో అంబేద్కర్ విగ్రహాన్ని మార్చకపోతే ముఖ్యమంత్రి, స్పీకర్లపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కత్తి పద్మారావు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిరాకరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన పాదాల వద్ద నిలబడటం దళితుల విజయమని అన్నారు. కాగా అంబేద్కర్ విగ్రహంపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహం అంబేద్కర్‌కు పోలిక లేదన్నారు. విగ్రహాన్ని తక్షణమే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
కంట్రీలో ఉండే అర్హతలేని కిరణ్: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా శనివారం సీఎం కిరణ్‌పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న కిరణ్‌కు దేశంలో ఉండే అర్హతలేదన్నారు. ఈ సమయంలో సీఎం కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. ‘సోనియా దయ వల్ల మీకు సీఎం పదవి దక్కిన విషయం మరచిపోకండి. సోనియా వల్లనే బిల్లు వచ్చింది. దానిని మీరు వ్యతిరేకించడం మంచిది కాదు. సీఎం తీరును తీవ్రంగా ఖండిస్తున్నా.. బిల్లుపై ఓటింగ్ పెట్టే విధంగా సభ్యులను ప్రేరేపిస్తున్నారు.. మీరు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు.. కంట్రీలో ఉండే అర్హత మీకు లేదు, బిల్లును వ్యతిరేకిస్తే.. చరిత్ర క్షమించదు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక చిత్తూరుకే సీఎంవా ?’ అని కిరణ్‌ను శంకర్రావు నిలదీశారు. ఈ సమయంలో కొందరు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా దయ వల్లే తెలంగాణ వస్తున్నదని, అందుకే కొత్త రాష్ట్రానికి ‘సోనియా తెలంగాణ’ అనే పేరు పెట్టడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలని శంకర్రావు సూచించారు. -
సోనియా తల్లి!
తెలంగాణ తల్లి రూపంలో దర్శనమిస్తున్న ఈమె మరెవరో కాదు... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ. 'అమ్మ'కు గుడి కడతానన్న మాజీమంత్రి శంకర్రావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు గ్రామంలో శ్రీ సాయి బాబా మెగా శిల్పశాలలో తయారు చేస్తున్న నమూనా మట్టి విగ్రహం ఇది. దీనిని పరిశీలించేందుకు శంకర్రావు మంగళవారం కృష్ణాజిల్లాకు వెళ్లారు. అధిష్టానమ్మ సోనియా గాంధీని స్తుతించడంలో శంకర్రావుది ప్రత్యేక శైలి. 'మేడమ్' వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. సోనియాను తెలంగాణ దేవతగా వర్ణిస్తూ ఆమెకు ఆలయం కట్టేందుకు సన్నద్ధం అయ్యారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం నందిగామలో శంకర్రావు .... సోనియా గుడికి శంకుస్థాపన కూడా చేశారు. తన 9 ఎకరాల పొలంలో కొంతమేర అమ్మకు ఆలయం కట్టిస్తున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబు నాయుడు నా మిత్రుడు:శంకర్రావు
హైదరాబాద్ః టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు తన మిత్రుడని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు తెలిపారు. అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబు ను శంకర్రావు సోమవారం పరామర్శించారు. చంద్రబాబు తన మిత్రుడైనందునే మానవతా ధృక్పథంతో ఆయున్ను కలిశానని శంకర్రావు చెప్పారు. లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధానమంత్రి అభ్యర్ధిగా రాహుల్‌గాంధీ పేరును వెంటనే ప్రకటించాలని రాష్ట్ర మాజీమంత్రి పి. శంకర్రావు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. రాహుల్ గాంధీ ఎక్కడ పోటీచేసినా, ఆయన తరపున ప్రచారం చేస్తానని, నరేంద్ర మోడీపై పోటీకి దిగినాసరే గెలిపిస్తానని శంకర్ రావు చెప్పారు. ఆయున వుంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో వూట్లాడుతూ, రాహుల్‌ను ప్రధానిగా ప్రజలు కోరుకుంటున్నట్టు పలు సర్వేల్లో తేలిందన్నారు. -
వారం రోజుల్లో కొత్త సీఎం : శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్‌రెడ్డిని తప్పించడం ఖరారైపోయిందని మాజీ మంత్రి పి.శంకర్రావు చెప్పారు. వారం రోజుల్లో రాష్ట్రానికి కొత్త సీఎం రాబోతున్నారని, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అధిష్టానాన్ని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘నీకు గౌరవం కూడా ఉందా? నీ ఊరికే వెళదాం. ప్రజలు నీకు గౌరవమిస్తారో? మాకు ఇస్తారో తేల్చుకుందాం. విభజన విషయంలో అంతా స్టేజీ షో నడిపిస్తున్నావ్? ఎవరిని ఎప్పుడు ఎట్లా సెట్ చేయాలో హైకమాండ్‌కు తెలుసు. ఐదు రోజుల్లో సీఎం ప్లగ్ పీకేయడం ఖాయం’’అని పేర్కొన్నారు. -
మీరు కుమ్మక్కవుతూ.. నా వైపు వేలు చూపుతారా? : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: 16 నెలలు తాను జైల్లో ఉన్నపుడు ఓవైపు రకరకాలుగా ఇబ్బందులు పెడుతూనే.. కుమ్మక్కు రాజకీయాల విషయానికి వచ్చేటప్పటికి తమపై వేలెత్తి చూపించే ప్రయత్నం చేశారని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘అలాంటి ఆరోపణలు చేస్తున్న వారిని నేనొక్కటే ప్రశ్నిస్తున్నా... ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారు..? అయ్యా ఒక్కసారి గతాన్ని తిరగేయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన శంకర్రావు నాపై రిట్ పిటిషన్ (నంబర్694) దాఖలు చేశారు. టీడీపీకి చెందిన అశోక్‌గజపతిరాజు, ఎరన్న్రాయుడు.. వీరిద్దరూ కలిసి నాపై 7794 అనే మరో పిటిషన్ వేశారు. వీరిద్దరూ శంకర్రావుతో కలిసి కోర్టుకు వెళ్లారు. ఆ రిట్ పిటిషన్లను ఒకసారి పరిశీలిస్తే కామాలు, పుల్‌స్టాపులు కూడా మారకుండా ఒకటిగానే ఉంటాయి. ఇద్దరూ కోర్టుకు వెళ్లి ఒక చనిపోయిన వ్యక్తి మీద (దివంగత వైఎస్‌పైన).. ఆయన చనిపోయిన 18 నెలల తరువాత.. ఆ వ్యక్తి ఇక రాడు, ఇక లేడు అన్నపుడు.. ఆ వ్యక్తి కొడుకు, కాంగ్రెస్ వీడిన రెండు నెలల తరువాత.. ఆ వ్యక్తిని దెబ్బకొట్టడం కోసం చనిపోయాడన్న కనీస ఇంగితం కూడా మర్చిపోయి ఇద్దరూ కలిసి కోర్టుకు వెళ్లి రిట్లు వేసింది వాస్తవం’’ అని ఆయన గుర్తుచేశారు. ఆ రోజు కోర్టుకు ఎందుకు జవాబు చెప్పలేదు? ‘‘కోర్టులో కేసులు వేసిన తర్వాత కోర్టు సమన్లు ఇచ్చింది. నన్ను 52వ రెస్పాండెంట్‌గా కోర్టు సమన్లు ఇస్తుంది. మొదట 1 నుంచి 19 దాకా ప్రతివాదులుగా చేరుస్తూ కోర్టు జవాబు అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వంలోని ఆ శాఖలు జవాబు ఇవ్వాల్సి ఉన్నా.. కావాలని జవాబు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది. ఎందుకు తప్పుదోవ పట్టించింది? ఎందుకు మీరు జవాబు ఇవ్వలేక పోయారు? ఒకవేళ జవాబిస్తే.. ‘అన్నీ బిజినెన్స రూల్స్ ప్రకారం జరిగాయి.. చంద్రబాబునాయుడు గారి హయాంలో కూడా ఇలాంటివి అనేకం జరిగాయి’ అని చెప్పాల్సి వస్తుందని ఏమీ జవాబివ్వలేదు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అలా చేసింది. ఫలితంగా కోర్టు విచారణకు ఆదేశించింది. ఆదేశించిన తరువాత కేవలం 14 రోజుల్లో నా ఇళ్లమీద సోదాలు చేసి అందరినీ ఇబ్బందులు పెట్టారు. ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అదే చంద్రబాబేమో కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి కోర్టుకు వెళతారు. అంతేకాదు.. కోర్టుకు వెళ్లిన తరువాత సమాచార హక్కు కమిషనర్ల పదవులను కలిసి పంచుకునే యత్నం చేస్తారు. అంతేకాదు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసికట్టుగా పోటీ చేస్తారు. ఉప ఎన్నికల్లో కూడా కలసికట్టుగా పనిచేస్తారు. చంద్రబాబు గారి మీద ఐఎంజీ కేసుల్లోనూ ఎమ్మార్ కేసుల్లోనూ విచారణ జరక్కుండా జాగ్రత్త పడతారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా కూడా నిస్సిగ్గుగా తన ఎంపీలను గైర్హాజరు కూడా చేయిస్తారు. అదొక్కటే కాదు.. మొన్నటికి మొన్న రూ. 32 వేల కోట్ల భారం ప్రజలపై వేసి కరెంటు చార్జీలను బాదితే.. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాళ మొత్తం ప్రతిపక్షాలన్నీ కలసి అవిశ్వాస తీర్మానం పెడితే.. చంద్రబాబు మాత్రం ఏకంగా విప్ జారీ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతారు. నేనొక్కటే అడగదల్చుకున్నా... ఎవరయ్యా! ఎవరితో ఎవరు కుమ్మక్కు అయ్యారు? ఇవాళ రాష్ట్రాన్ని విడగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ.. ఆ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నది చంద్రబాబు.. వ్యతిరేకిస్తున్నది మేము. ఎఫ్డీఐలో ఓటింగ్ జరుగుతున్నపుడు వ్యతిరేకించింది మేమే. అనర్హతకు గురవుతామని తెలిసి కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసింది మేము. కాంగ్రెస్ విభజన చేస్తాఉంటే వ్యతిరేకిస్తున్నది మా పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారు? అని నేను అడుగుతున్నా’’ అని జగన్ తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు. ‘‘పదహారు నెలలుగా వీరు చెప్తున్న అబద్ధాలు చూసి చూసి బాధ కలిగింది. అందుకే ఇవాళ మీ ద్వారా కనీసం నిజాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని భావించి ఆ బాధను కాస్తో కూస్తో వెలిబుచ్చా’’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో ఒప్పందమా! : అలాగైతే 16 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వస్తుంది ‘‘నేను కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని ఉంటే పదహారు నెలలు జైలులో ఎందుకు ఉండాల్సి వస్తుంది. (కాంగ్రెస్‌కూ, మీకూ మధ్య ఒప్పందం కుదిరినందునే బెయిల్‌పై విడుదలయ్యారంటున్నారని మీడియా సమావేశంలో విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన స్పందించారు.) ఒప్పందం ఉంటే నేనెందుకు 16 నెలలు జైల్లో ఉంటాను. నాది ఒప్పందాలు కుదుర్చుకునే స్వభావం కాదు. ఒప్పందాలు కుదుర్చుకునే వాడినైతే అసలు నేనెందుకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మీకిక్కడ వాస్తవాలు వివరిస్తాను... బెయిలు కోసం మేము సుప్రీంకోర్టుకు ఒకసారి కాదు, రెండుసార్లు వెళ్లాం. తొలిసారి వెళ్లినప్పుడు ఆరునెలల లోపు దర్యాప్తు ముగించండి అని గడువు పెట్టింది. గడువులోగానే సీబీఐ చార్జిషీట్ వేస్తుందని భావించిన మా న్యాయవాదులు ఆరు నెలలు గడువు వద్దని కోరారు. కానీ దురదృష్టవశాత్తూ సీబీఐ చార్జిషీటు వేయలేదు. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాం. అప్పుడు మళ్లీ నాలుగు నెలలు గడువు విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సీబీఐ కచ్చితంగా పాటించక తప్పదు కదా... ఆ ప్రకారమే చార్జిషీట్లు వేశారు. నాకు అర్థం కానిది ఒక్కటే. వాస్తవాలు ఇలా ఉంటే ఇంకా మా మధ్య ఒప్పందం ఉందని ఎవరైనా ఎలా అంటారు? ఒక కేసులో మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి కానప్పుడు సదరు వ్యక్తి బెయిల్ పొందవచ్చని రాజ్యాంగమే స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగపరంగా బెయిలు పొందే హక్కు ఉంటుంది. అది జగన్ కావచ్చు, మీరు కావచ్చు, మరొకరు కావచ్చు. ఇక్కడేమీ నేరస్తుడిగా రుజువు కాలేదు. అలాంటిది పదహారు నెలలు జైల్లో ఉన్న తరువాత బెయిలు వస్తే కూడా ఒప్పందం అని ఎలా అంటారన్నదే నాకు అర్థం కాని విషయం. ఇది నాపై రాజకీయంగా జరిగిన కుట్ర. రాజకీయ పార్టీలు నాపై కోర్టుకు వెళ్లాయి. ఈ యంత్రాంగాలను రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి. మూడు నెలల్లో రావాల్సిన బెయిల్‌ను రాకుండా పదహారు నెలలు సాగదీశారు. ఇప్పుడు బెయిలు వస్తే ఒప్పందం అనే మాటలనడం నన్ను బాధిస్తున్నాయి..’’ -
మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్ష
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్ష చేపట్టారు. తన తమ్ముడు దయానంద్ అరెస్టును నిరసిస్తూ శంకర్రావు మౌనదీక్షకు దిగారు. భూకబ్జా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించటం,చీటింగ్ కేసుల్లో మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తమ్ముడు దయానంద్‌ను ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరపర్చారు. దీనిని నిరసిస్తూ శంకర్రావు మంగళవారం మౌనదీక్షకు పూనుకున్నారు. సీమాంధ్రలో ఇందిర, రాజీ వ్ విగ్రహాల ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని శంకర్రావు తెలిపారు. ఆ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు ఎవర్నీ అరెస్ట్ చేయకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నన్ను, నా కుటుంబసభ్యులను సీఎం, డీజీ పీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు, చెల్లెల్ని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో తన ఇంటిపై దాడి విషయంలో సభాహక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. డీజీ పీ ఆస్తులు, సీఎం ఎర్రచందనం కేసులో సీబీఐ విచారణ చేయించాలన్నారు. తనపై సీబీఐ విచారణ కూడా సిద్ధంగా ఉన్నట్లు శంకర్రావు తెలిపారు.