
సాక్షి, గుంటూరు: లోకేష్‌ను పప్పు అని ఎందుకు అంటున్నారో అర్థమవుతోందని, ఆయన ఓ అయోమయంలా తయారయ్యాడంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నంబురు శంకరరావు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో లోకేష్ చెప్పాలని, 2400 కోట్లతో అభివృద్ధి చేశామని లోకేష్ అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు.
‘‘టీడీపీ నేతలను ప్రజలంతా ఛీ కొడుతున్నారు. లోకేష్‌ను పప్పు అని ఎందుకు అంటున్నారో అర్థమవుతోంది. లోకేష్.. ఓ అయోమయంలా తయారయ్యాడు. లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రైతుల గురించి టీడీపీ ఏనాడైనా ఆలోచించిందా?. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు, లోకేష్‌ది’’ అంటూ మండిపడ్డారు.
‘‘లోకేష్ పాదయాత్రకు సభకు మద్యం చీరలు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారు. చంద్రబాబు లోకేష్ జనానికి చెప్పాలి. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ బహిరంగ చర్చకు రావాలి. నేను 400 ఎకరాలు అటవీ భూమి ఆక్రమించుకుని వెంచరేశానని లోకేష్ చెప్తున్నాడు. దమ్ముంటే ఆ ల్యాండ్ ఎక్కడుందో చూపిస్తే పేదలకు పంచుతాను’’ అంటూ ఎమ్మెల్యే శంకరరావు సవాల్ విసిరారు.
చదవండి: Fact Check: వాస్తవాలు తెలిసి కూడా ‘ఈనాడు’ అబద్ధాలు
Comments
Please login to add a commentAdd a comment