హైదరాబాద్‌ః టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు తన మిత్రుడని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు తెలిపారు. అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబు ను శంకర్‌రావు సోమవారం పరామర్శించారు. చంద్రబాబు తన మిత్రుడైనందునే మానవతా ధృక్పథంతో ఆయున్ను కలిశానని శంకర్‌రావు చెప్పారు.
లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధానమంత్రి అభ్యర్ధిగా రాహుల్‌గాంధీ పేరును వెంటనే ప్రకటించాలని రాష్ట్ర మాజీమంత్రి పి. శంకర్‌రావు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. రాహుల్ గాంధీ ఎక్కడ పోటీచేసినా, ఆయన తరపున ప్రచారం చేస్తానని, నరేంద్ర మోడీపై పోటీకి దిగినాసరే గెలిపిస్తానని శంకర్ రావు చెప్పారు. ఆయున వుంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో వూట్లాడుతూ, రాహుల్‌ను ప్రధానిగా ప్రజలు కోరుకుంటున్నట్టు పలు సర్వేల్లో తేలిందన్నారు.