బుల్లితెర నటి శ్రుతి అనుమానాస్పద మృతి
బెంగళూరు(బనశంకరి) : బుల్లితెర నటి తన స్నేహితుడి గదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... హరోహళ్లికి చెందిన శ్రుతి )24) ఏడేళ్లక్రితం రమేశ్ అనే వ్యక్తితో వివాహం కాగా ఈమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె ఇంటికి సమీపంలో ఉన్న కాచోహళ్లిలో శ్రీకాంత్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు, ఇతడితో శ్రుతి సన్నితంగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సోమవారం రాత్రి శ్రీకాంత్ ఇంటికి శ్రుతి వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. గొడవ జరిగిన కొద్ది సేపటికే శ్రుతి ఓ గదిలో తలుపు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టి చూడగా శ్రుతి ఉరి వేసుకున్న దృశ్యం కంటపడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.