'చనిపోయిన' వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ తో దొరికాడు | Police arrest 'dead' RTI activist chandramohan sharma | Sakshi
Sakshi News home page

'చనిపోయిన' వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ తో దొరికాడు

Published Thu, Aug 28 2014 8:35 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

'చనిపోయిన' వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ తో దొరికాడు - Sakshi

'చనిపోయిన' వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ తో దొరికాడు

నోయిడా: చనిపోయినట్లు పోలీసులను నమ్మించి, తప్పించుకు తిరుగుతున్న ఆర్టీఐ కార్యకర్త చంద్రమోహన్ శర్మను గ్రేటర్ నోయిడా పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మే 2న జరిగిన కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడని, సామాజిక సమస్యలపై గళమెత్తినందుకే అతణ్ని దండగులు పొట్టనబెట్టుకున్నారని శర్మ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే శర్మ మరణించినట్లు చెబుతున్న రోజునుంచే పొరుగున ఉండే ఓ యువతి కూడా కనిపించకుండా పోవడంతో ఆ దిశగా ప్రారంభించారు. సదరు యువతి ఫోన్ నంబర్ను ట్రేస్ చేయగా ఆమె బెంగళూరులో ఉన్నట్లు సమాచారమందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు యువతితో పాటు చంద్రమోహన్ శర్మను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

(ఇంగ్లీషులో ఇక్కడ చదవండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement