RTI activist
-
కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం సమావేశం వివరాలు, తీర్మానాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2017 అక్టోబర్ 3న చేసిన తీర్మానం ప్రకారం.. కొలీజియం చర్చల, తీర్మానాల వివరాలను బయటపెట్టలేమని తెలిపింది. తుది నిర్ణయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. 2018 డిసెంబర్ 12న కొలీజియం భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. కొలీజియం అనేది బహుళ సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ అని, కొలీజియం చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకురాలేమని, సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది. కొలీజియంలోని సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేస్తేనే తీర్మానాలు తుది నిర్ణయాలుగా మారుతాయని, అలాంటి వాటినే బయటపెట్టగలమని వివరించింది. తీర్మానాలే ఫైనల్ కాదు 2018 డిసెంబర్ 12 నాటి కొలీజియం సమావేశం అజెండా వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం భేటీలో సంప్రదింపుల కోసం చేసే తీర్మానాలు ఫైనల్ అని చెప్పలేమని తెలిపింది. తీర్మానాలపై సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేసే దాకా అవి అస్థిర నిర్ణయాలేనని పేర్కొంది. అందరూ సంతకాలు చేస్తేనే నిర్ణయాలు ఖరారవుతాయని వెల్లడించింది. అంటే కొలీజియం వ్యవస్థలోని సభ్యులందరి ఆమోదం ఉంటేనే తీర్మానాలు నిర్ణయాలవుతాయని వివరించింది. కొలీజియం విషయంలో మీడియాలో వచ్చే రిపోర్టులను విశ్వసించలేమని, ఇదే వ్యవస్థలో పనిచేసిన మాజీ సభ్యుడి ఇంటర్వ్యూను పట్టించుకోలేమని ధర్మాసనం ఉద్ఘాటించింది. కొలీజియం పనితీరు పట్ల మాజీ జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్లపై తాము మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించింది. 2018 డిసెంబర్ 12న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమయ్యింది. పలువురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి, తీర్మానాలు చేసింది. అయితే, ఈ తీర్మానాలు, నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. 2019 జనవరి 10న జస్టిస్ మదన్ బి.లోకూర్ పదవీ విరమణ సందర్భంగా కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2018 డిసెంబర్ 12 నాటి భేటీలో కేవలం ప్రతిపాదనలపై చర్చించామని, వాటిని ఫైనలైజ్ చేయలేదని పేర్కొంది. అది మనకు పరాయి వ్యవస్థ: కిరణ్ రిజిజు కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నడుమ వివాదం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ వ్యవస్థను ప్రభుత్వం తప్పుపడుతోంది. కొలీజియం అనేది మనకు పరాయి వ్యవస్థ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే ఆక్షేపించారు. అయితే, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిప్పి కొట్టింది. కొలీజియం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని, అనవసర వ్యాఖ్యలతో దాన్ని పట్టాలు తప్పించవద్దని హితవు పలికింది. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
ఎస్బీఐ మొండి బకాయిలు అన్ని కోట్లా? షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందించిన రుణాల్లో 1,71,953 కోట్ల రూపాయలకు పైగా మొండి బకాయిలు ఉన్నాయని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేయని మొండి బకాయిలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు రుణాలను తీసుకొని తిరిగి చెల్లించని అప్పులు ఎన్ని ఉన్నాయనే సమాచారాన్ని భారత రిజర్వ్ బ్యాంకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని తెలుసుకున్న రాజేంద్ర పల్నాటి ఆ వివరాలను బయట పెట్టారు. వీటితో పాటుగా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాల కోసం నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)లో భాగంగా అప్పుగా ఇచ్చిన లోన్లు 1,06,804 కోట్ల రూపాయలు ఇంకా తిరిగి రాలేదని భారతీయ స్టేట్ బ్యాంక్ పీఐఓ ములుకుంట్ల శ్రీనివాస్ రావు తెలిపారు. -
29 మంది పైలట్లు దుర్మరణం: ప్రధాన కారణం ఇదే!
సాక్షి:హైదరాబాద్: విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల సమాచార సమాచారాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)డేటా ప్రకారం 2014 నుండి ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో 29 మంది పైలట్లు మరణించినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాబిన్ జాకీస్ దాఖలు చేసిన సమాచార హక్కు పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ సమాచారం అందించింది. గత ఎనిమిదేళ్లలో జరిగిన మొత్తం 19 ప్రమాదాల్లో ఆరు మహారాష్ట్రలోనే జరిగాయి. ఈ ఆరు ప్రమాదాల్లో 10 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక ప్రమాదాలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. ఈ రాష్ట్రంలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్ హన్స్ మూడు విమాన ప్రమాదాలు జరగ్గా, ఇదే అత్యధికంగా ఆరు మరణాలకు దారితీసింది.ఈ 19 క్రాష్లలో చాలా వరకు ఐదు 2015లో, నాలుగు 2020లో, 2019, 2018 సంవత్సరాల్లో ఒక్కొక్కటి చోటుచేసుకున్నాయి. ఏఏఐబీ వెబ్సైట్లో ఉన్న నివేదికల ప్రకారం ప్రమాదాల వెనుక అత్యంత సాధారణ కారణం పైలట్ లోపం అని పేర్కొంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్లిద్దరూ మరణించిన సంగతి తెలిసిందే. -
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్‌లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్‌లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌తో ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్‌లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్‌లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్‌లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్‌లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్‌లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్‌పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్‌షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
ఆయనేమైనా రాజా? దేవుడా?.. ఇంత అతి చేస్తున్నారు
‘ఐదు గంటలపాటు కిటికీలు మూసేయండి. మూడురోజుల పాటు మీ వ్యాపారాలు బంద్ చేయండి’ ఈ ఆదేశాలు జారీ చేసింది అహ్మదాబాద్ పోలీసులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ రెండు రోజుల పర్యటన సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా కారణాలు చూపిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఒకరు అభ్యంతరం చెప్పడంతో పోలీసుల అత్యుత్సాహం వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆది, సోమవారాల్లో అహ్మదాబాద్ పర్యటించారు. అయితే ఆయన పర్యటనకు ముందు వెజల్పూర్ పోలీసులు ఎస్సై ఒడెదర పేరుతో ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆదివారం ఉదయం ఓ కమ్యూనిటీ హాల్ ప్రారంభానికి మంత్రి షా వస్తున్నారని, కాబట్టి, ఆ దగ్గర్లోని 300 ఇళ్ల కిటికీలన్నింటిని మూసేయాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. జె కేటగిరీ సెక్యూరిటీ నేపథ్యంలోనే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. జులై 10న ఆ నోటీసులను ఐదు అపార్ట్మెంట్లకు, చుట్టుపక్కల ఇళ్లకు అంటించి తప్పనిసరిగా పాటించాలని మైకులో అనౌన్స్ చేశారు కూడా. అయితే వెజల్పూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న పంక్తి జోగ్(44) అనే ఆవిడ అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని, కాబట్టి కిటికీలు తెరిచే ఉంచుతానని ఆమె స్టేషన్‌కు వెళ్లి మరీ పోలీసులకు స్పష్టం చేసింది. అంతేకాదు తనలాంటి వాళ్లు ఎందరో ఇబ్బందులు పడతారని, కాబట్టి ఆ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె పోలీసులతో వాదించింది. నిజానికి ఆమె అభ్యంతరం అదొక్కటే ఒక్కటే కాదు. పంక్తి ఓ ఆర్టీఐ ఉద్యమకారిణి. షా పర్యటన నేపథ్యంలో పోలీసులు నిజంగానే అత్యుత్సాహం ప్రదర్శించారనేది ఆమె పాయింట్. మూడు రోజుల పాటు చిరువ్యాపారులను వ్యాపారాలు మూసేయాలని ఆదేశించారని, అలాగే మళ్లింపు పేరుతో వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణలకు స్థానికులు కొందరు సైతం తోడవ్వడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎస్సైపై చర్యలు? ‘మనం ప్రజాస్వామ్య బద్ధమైన దేశంలోనే ఉన్నామా? వీళ్లు మంత్రులా? రాజులా?. ఆయనేమైనా రాజా? దేవుడా? ఇంత అతి చేస్తున్నారు. కాదు కదా. జనాలు ఓట్లేస్తే గెలిచిన మంత్రి.. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఏంటి?. స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం సామాన్యులకు హక్కులు ఇచ్చింది’ అని ఆమె పోలీసుల ఎదుట వాదించింది. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లోనూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. అయితే పోలీసులు మాత్రం తాము ప్రజల్ని బలవంతం చేయలేదని, ఆమె ఆరోపణల్లో నిజం లేదని చెబుతూనే సర్క్యులర్ గురించి మాట్లాడేందుకు ఎస్సై ఒడెదర నిరాకరించారు. ఇక ఈ వ్యవహారం మీడియా ద్వారా ఫోకస్‌లోకి రావడంతో అహ్మదాబాద్ కమిషన్ సంజయ్ వాస్తవ స్పందించారు. ఇలాంటి ఆదేశాలను చర్యలను ఉపేక్షించమని, దర్యాప్తు జరిపించి ఎస్సైపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్ పోలీసులకు తమ నుంచి అలాంటి ఆదేశాలు ఏం జారీ కాలేదని కేంద హోం మంత్రి అమిత్ షా భద్రతా విభాగం వెల్లడించింది. -
Railways: ‘స్పెషల్’ పేరుతో బాదారు.. ఇప్పుడేమో ?
న్యూఢిల్లీ : కోవిడ్ కాలంలో స్పెషల్ పేరుతో ఎడాపెడా టిక్కెట్ల రేట్లు పెంచినా... సబ్సీడీలు తగ్గించినా రైల్వే శాఖ కష్టాలు తీరలేదు. నిర్వహణ వ్యయం మెరుగవలేదు. తాజాగా ఆ శాఖ వెల్లడించిన గణాంకాలు ఇదే విషయం తెలియజేస్తున్నాయి. మెరుగుపడని ఓఆర్ కోవిడ్ వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా 2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఆ తర్వాత క్రమంగా రైళ్లను పునరుద్ధరించినా ... గరిష్టంగా 65 శాతం రైళ్లనే నడిపించింది రైల్వేశాఖ. ఐనప్పటికీ ఆపరేటింగ్ రేషియో (ఓఆర్)లో మెరుగైన ఫలితాలు రాలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 97.45 శాతం అంతకు ముందు ఆర్థిక సంవత్సరానికి 98.36 శాతం ఓఆర్ సాధించింది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ పెట్టిన ఆర్జీతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సబ్సిడీలు రద్దు కోవిడ్ కాలంలో నష్టాలను తగ్గించుకునేందుకు సీజనల్ టిక్కెట్స్ రద్దు చేసింది, వికలాంగ, వృద్ధులు, రోగుల రాయితీలు రైల్వే పక్కన పెట్టింది. ఒకటేమిటీ కరోనా పేరుతో అందించే సబ్సీడీలు అన్నింటికీ కోత పెట్టింది... సామాన్యుల జేబుకు చిల్లు పెట్టింది ఇండియన్ రైల్వేస్. ఏడాది పాటు బాదుడు కార్యక్రమం నడిపించింది. ఐనా సరే సానుకూల ఫలితాలు పొందలేదు రైల్వేశాఖ. స్పెషల్ బాదుడు కోవిడ్ ఆంక్షల పేరుతో రైళ్లు నడిపించడంపై రైల్వేశాఖ ఏకపక్షంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్లను నడిపించకపోవడం, ఇదే సమయంలో ఆదాయం పెంచుకోవడం కోసం సాధారణ రైళ్లకు కూడా, స్పెషల్ స్టేటస్ తగిలించి టికెట్ రేట్లు పెండచడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలను ఇబ్బందులు పాలు చేసినా లక్ష్యాన్ని రైల్వేస్ అందుకోలేకపోయింది ఆదా పలు కీలక రూట్లలో ఎలక్ట్రిఫికేషన్ చేయడం ద్వారా రూ. 9,500 కోట్లు ఆదా చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. దీంతో పాటు రైల్వే ఉద్యోగుల విధులను క్రమబద్ధీకరించడం ద్వారా అదనంగా మరో రూ. 4,000 కోట్లు మిగులు వచ్చిందని ప్రకటించింది. చదవండి : సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
Akhil Gogoi: జైలు నుంచి అసెంబ్లీకి..
శివసాగర్(అస్సాం): పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక ఉద్యమకారుడు, సమాచార హక్కు చట్టం కార్యకర్త అఖిల్ గొగోయ్(46) జైల్లో ఉంటూ అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తొలినేతగా గుర్తింపు పొందారు. ఆయన శివసాగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి సురభీ రాజ్‌కొన్వారీపై 11,875 ఓట్ల తేడాతో నెగ్గడం విశేషం. దేశద్రోహం ఆరోపణలతో 2019 డిసెంబర్లో అఖిల్ గొగోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉంటున్నారు. రాయ్జోర్ దళ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 57,219 ఓట్లు సాధించారు. పోలైన మొత్తంలో ఓట్లలో 46.06 ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ తొలుత అఖిల్‌కి మద్దతు ప్రకటించింది. పార్టీ టికెట్‌ను మాత్రం శుభ్రమిత్ర గొగోయ్‌కు కేటాయించింది. శుభ్రమిత్ర మూడో స్థానంలో నిలిచారు. జైలు నుంచి బహిరంగ లేఖలు అఖిల్ జైల్లో ఉంటూనే ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. తరచుగా అస్సాం ప్రజలకు బహిరంగ లేఖలు రాశారు. ప్రజా సమస్యలను లేవనెత్తేవారు. ఆయన తల్లి ప్రియద 85 ఏళ్ల వృద్ధురాలు. కుమారుడి గెలుపు కోసం శివసాగర్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేధా పాట్కర్, సందీప్ పాండే అఖిల్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. వందలాది మంది రాయ్జోర్ దళ్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు. అఖిల్ గొగోయ్‌ను గెలిపించాలని కోరారు. ఆయన చేతిలో డబ్బులేవీ లేవు. రూ.60,497 బ్యాంకు డిపాజిట్లు మాత్రమే ఉన్నాయి. అఖిల్ గొగోయ్ గౌహతిలోని కాటన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1995–96లో కాటన్ కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. -
గొగోయ్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
గువాహటి: సమాచార హక్కు కార్యకర్త అఖిల్ గొగోయ్ ఇంట్లో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా ల్యాప్‌టాప్‌తో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ 12న ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్ నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. అతని పాన్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తనిఖీలు మూడు గంటలపాటు జరిగాయి. తనిఖీలు ముగిసిన అనంతరం గొగోయ్ భార్య గీతాశ్రీ తములీ స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను విలేకరులకు చూపించారు. కజిరంగలోని కేఎంఎస్ఎస్ ఆర్చిడ్ ఎన్విరాన్మెంట్ పార్కుకు సంబంధించిన పత్రాలను కూడా ఎన్ఐఏ బృందం కోరిందనీ, అయితే దానికి సంబంధించిన సమాచారం ఏమీ తన దగ్గర లేదని ఆమె వారికి చెప్పింది. కాగా, గొగోయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశించింది. -
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదు
అహ్మదాబాద్: ఆర్టీఐ కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీతోపాటు ఆరుమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గిర్ అరణ్య ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను పిల్ ద్వారా వెలుగులోకి తేవడంతో జెత్వాను 2010లో నాటి జునాగఢ్ ఎంపీ దిను సోలంకి హత్య చేశారు. ఈ అక్రమ మైనింగ్‌లో సోలంకి ఉన్నాడని జెత్వా తన పిల్లో పేర్కొనడమే ఈ హత్యకు కారణం. దోషులు సోలంకి, అతడి మేనల్లుడు శివలకు జీవిత ఖైదుతోపాటు రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ జడ్జి కేఎం దేవ్ గురువారం తీర్పునిచ్చారు. వీరితోపాటు శైలేష్ పాండ్య, బహదూర్‌సిన్హ్ వాధెర్, పంచన్ దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉడాజి ఠాకూర్లకు జీవిత ఖైదు విధించింది. 2010లో ఓ వైపు జెత్వా దాఖలు చేసిన పిల్‌పై వాదనలు జరుగుతుండగానే గుజరాత్ హైకోర్టు ప్రాంగణంలో అమిత్ జెత్వా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును విచారించిన అహ్మదాబాద్ పోలీసులు బీజేపీ ఎంపీ దిను సోలంకికి క్లీన్చిట్ ఇచ్చారు. సంతృప్తి చెందని మృతుడు అమిత్ జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అందుకు అంగీకరించడంతో సీబీఐ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేసును పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, తమ కుటుంబానికి న్యాయం అందిందని తీర్పు అనంతరం భిఖాభాయ్ పేర్కొన్నారు. -
గుజరాత్ బీజేపీ మాజీ ఎంపీకి షాక్
అహ్మదాబాద్ : ఆర్టీఐ కార్యకర్త సంచలన హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకికి అహ్మదాబాద్ సీబీఐ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. సోలంకితో పాటు ఈ కేసులో దోషులందరికీ జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గత శనివారం సోలంకి తోపాటు మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు గురువారం వీరికి శిక్షలను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. అలాగే వీరికి 59,25,000 రూపాయలు జరిమానా కూడా విధించింది. ఈ సొమ్ములో రూ.11 లక్షలు ఆర్టీఐ కార్యకర్త కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది. ముఖ్యంగా భార్యకు రూ. 5 లక్షలు, ఇద్దరు పిల్లలకు రూ.3 లక్షల చొప్పున ఏదైనా జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చెప్పింది. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఆర్టీఐలో పిల్ దాఖలు చేసిన నెలరోజుల్లోనే ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్య గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో సోలంకి, మరికొంతమందితో కలిసి అమిత్‌ను దారుణంగా హత్య గావించారన్న సీబీఐ వాదనలను కోర్టు విశ్వసించింది. దీంతో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకకూర్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ జీవిత ఖైదు శిక్షను విధించారు. మరోవైపు తన కుమారుడు అమిత్ జేత్వా హత్య పై సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న తండ్రి భిఖిభాయ్ జేత్వా ఈ తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజా తీర్పు భారత న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి లభించిన విజయమని పేర్కొన్నారు. ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందన్నారు. చదవండి : సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్ -
సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో బీజేపీకి గుజరాత్లో భారీ షాక్ తగిలింది. సంచలనాత్మక హత్య కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకితో పాటు మరో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. అనేక మలుపులు తరువాత ఈ కేసులో సంచలన తీర్పు వెలువడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ శనివారం ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల (జూలై) 11న వీరికి శిక్షలను ఖరారు చేయనున్నారు. దోషుల్లో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకూర్ ఉన్నారు. పులుల సంరక్షణా కేంద్రం గిర్ అడవుల్లో అక్రమ తవ్వకాలపై ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్యకు గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో ఇద్దరు దుండగులు అమిత్‌ను దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా సోలంకిపై సీబీఐ అభియోగాలు మోపింది. గిర్ అడవిలోని నిషేధిత ప్రాంతాలలో సోలంకి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చినందున అమిత్‌ను కిరాయి గుండాలతో హత్య చేయించినట్టుగా సీబీఐ ఆరోపించింది. 2013లో సోలంకిని అరెస్ట్ చేసిన సీబీఐ అమిత్ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా వాదించింది. ప్రధానంగా నిందితుల కాల్ డేటా రికార్డ్స్ (సిడిఆర్) ఆధారంగా వీరిని నేరస్తులుగా పేర్కొంటూ చార్జ్‌షీటు దాఖలు చేసింది. కాగా ఈ హత్య కేసును మొదట అహ్మదాబాద్ డిటెక్షన్ క్రైమ్ బ్రాంచ్ (డిసిబి) విచారించింది. కానీ నిందితులందరికీ డీసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే విచారణ సమయంలో 195మంది సాక్షుల్లో 105 మంది సోలంకి బెదిరింపులకు లొంగిపోయారనీ, సీబీఐ దర్యాప్తు కోరుతూ అమిత జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తరువాత కేసు మరో మలుపు తిరిగింది. అనూహ్యంగా విచారణను నిలిపి వేసింది కోర్టు. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అసాధారణ ఆదేశాలిచ్చింది. ఈ కేసును పునిర్విచారణ చేయాలని స్పెషల్ కోర్టును కోరింది. అంతేకాదు న్యాయమూర్తి దినేష్ ఎల్ పటేను మార్చాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది. -
సమాచార హక్కుపై కేంద్రం దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో సమాచార హక్కు చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును ప్రవేశ పెడుతుందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే ఆ బిల్లులో ఏముంటుందన్న విషయం నిన్నటి వరకు వెల్లడి కాలేదు. ఈ చట్టంలోని సవరణ ప్రతిపాదనల గురించి కేంద్రం మంగళవారం పార్లమెంట్ సభ్యులకు ఓ సర్కులర్ జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లతోపాటు, సమాచార కమిషనర్ల జీత భత్యాలను, వారి పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం ఇక కేంద్రానికి దఖలు పడుతుందని అందులోని సారాంశం. తద్వారా కేంద్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లందరిని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఈ అధికారాలు కేంద్రానికి సిద్ధించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సమాచార కమిషనర్లు భయపడాల్సి వస్తుందని, లేదంటే జీత, భత్యాల విషయంలో కోత పెట్టడం, పదవి నుంచి తొలగింపు లాంటి బెదిరింపులతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్టీఐ చట్టం ఆవశ్యకత గురించి విస్తృతంగా ప్రచారం చేసిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ నిఖిల్ దేవ్ వ్యాఖ్యానించారు. ఇది చట్టాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆయన విమర్శించారు. ఈ సవరణల వల్ల ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్న సహకార సమాఖ్య వ్యవస్థ విధానం కూడా దెబ్బతింటుందని కామన్వెల్త్ మానవ హక్కుల కార్యకర్త వెంకటేశ్ నాయక్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన, ఇతర సమాచార కమిషనర్ల జీత భత్యాలను కేంద్రమే నిర్ణయిస్తుందంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హక్కులను కాలరాయడమే అవుతుందని ఆయన అన్నారు. కేంద్రం ఏ చట్టం, ఏ సవరణ బిల్లును తీసుకురావాలన్నా వాటిలోని ప్రతిపాదనలను ప్రజల ముందు విధిగా ఉంచాలని ‘ప్రీ లెజిస్లేటివ్ కన్సల్టెన్సీ పాలసీ–2014’ నిర్దేశిస్తోంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం బిల్లులోని ప్రతిపాదనలను ఎంపీలకు మాత్రమే సర్కులేట్ చేసింది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల జీత భత్యాలను చట్టమే నిర్దేశిస్తూ వచ్చింది. అందుకని వారు స్వతంత్య్రంగా వ్యవహరించేందుకు వీలు పడింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వేతనం, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటుందని, ఇతర సమాచార కమిషనర్ల వేతనం, ఇతర ఎన్నికల కమిషనర్లతో సమానంగా ఉంటుందని సమాచార చట్టం నిర్దేశిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనరల్ వేతనం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానం, ఇతర రాష్ట్ర సమాచార కమిషనర్ల వేతనం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానంగా ఉంటుందని చట్టం చెబుతోంది. అలాగే పదవీ కాలాన్ని ఐదేళ్లు, పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లు నిర్దేశించింది. 2005 నాటి సమాచార హక్కు చట్టంలో సవరణ తీసుకరావడం ఇది రెండోసారని, దీని వల్ల చట్టం పూర్తిగా నీరుగారి పోతుందని ‘నేషనల్ కాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్’ సంస్థకు చెందిన అంజలి భరద్వాజ్ ఆరోపించారు. సమాచార చట్టం నుంచి రాజకీయ పార్టీలను మినహాయిస్తూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలిసారి సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణ వల్ల రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు లేదా విరాళాలు వస్తున్నాయో, ఏ మొత్తంలో వస్తున్నాయో ప్రజలు తెలుసుకోవడానికి వీల్లేకుండా పోయింది. -
ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త దారుణ హత్య
మోతిహరి(బిహార్) : ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త రాజేంద్ర సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. తూర్పు చంపారన్‌లోని మత్‌బన్వారీ చౌక్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. ఎన్నో కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిన రాజేంద్ర సింగ్‌పై శత్రువులు ఇప్పటికే మూడుసార్లు దాడి చేశారు. ఈ విషయమై తనకు భద్రత పెంచాల్సిందిగా రాజేంద్ర సింగ్ పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు విఙ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్ ప్రాసెసింగ్‌లో ఉండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు... నితీశ్ కుమార్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రతిపక్ష ఆర్జేడీ విమర్శించింది. రాజేంద్ర సింగ్ హత్యకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేసింది. ఎన్డీయే కూటమి- నితీశ్ కుమార్ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్లు అర్థాంతరంగా తనువు చాలించాల్సి వస్తోందని ఆర్జేడీ సీనియర్ నేత అలోక్ మెహతా ఆరోపించారు. కాగా పోలీసు, ఉపాధ్యాయ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, గృహ, మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి పలు అంశాల గురించి ఎన్నో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో రాజేంద్ర సింగ్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన వెలుగులోకి తెచ్చిన కుంభకోణాలకు సంబంధించిన పలు కేసులు ప్రస్తుతం విచారణకు వచ్చిన నేపథ్యంలో హత్యకు గురికావడం గమనార్హం. -
షాకింగ్ : భారీ మొత్తంలో కరెన్సీ నోట్లు మాయం
ఓ సమాచార హక్కు కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద మొత్తంలో దేశీయ కరెన్సీ నోట్లు మాయమైపోయాయని తెలిసింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ.23వేల కోట్లు ప్రింట్ అయ్యాయని, కానీ అవేమీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు చేరుకోలేదని వెల్లడైంది. దీనిపై ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్ రాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజాన వ్యాజ్యం నేడు(ఫిబ్రవరి 12)న బొంబై హైకోర్టు ముందుకు విచారణకు రానుంది. ఆర్బీఐ, ఇతర ప్రింటింగ్ ఇన్స్టిట్యూషన్లు కరెన్సీ నోట్లపై ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయంపై మనోరంజన్ రాయ్ 2015లోనే ఓ పిల్ దాఖలు చేశారు. అసలేమి జరిగింది.... ప్రింటింగ్ ప్రెస్‌లు ముద్రించిన దేశీయ కరెన్సీ నోట్ల గణాంకాలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ వివరాల్లో ప్రింటింగ్ ప్రెస్‌లు రూ.500 డినామినేషన్ గల 19,45,40,00,000 పీస్‌ల నోట్లను ఆర్బీఐకి పంపించినట్టు తెలిసింది. కానీ ఆర్బీఐ మాత్రం తాను కేవలం 18,98,46,84,000 పీసుల నోట్లనే పొందినట్టు పేర్కొంది. అంటే రూ.23,465 కోట్ల విలువైన 46,93,16,000 పీసులు మాయమైపోయాయి. ఆర్టీఐకి సమర్పించిన డేటాలో రూ.1000 డినామినేషన్ కలిగి 4,44,13,00,000 పీసుల నోట్లను ఆర్బీఐకి పంపినట్టు ప్రింటింగ్ ప్రెస్‌లు తెలిపాయి. కానీ ఆర్బీఐ సమర్పించిన డేటాలో 4,45,30,00,000 పీసులను తాను అందుకున్నట్టు పేర్కొంది. అంటే రూ.1,170 కోట్లు అత్యధికంగా ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి ఆర్బీఐ పొందింది. ఈ లెక్కలు సరియైనవిగా లేవు. మరో ఆర్టీఐ డేటాలో 2000-2011 వరకు భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 డినామినేషన్ కలిగిన 13,35,60,00,000 పీసులను, రూ.1000 డినామినేషన్ కలిగిన 3,35,48,60,000 పీసులను ఆర్బీఐకి పంపినట్టు పేర్కొంది. కానీ ఈ నోట్లను అసలు ఆర్బీఐ పొందలేదని తెలిసింది. ఆర్బీఐ, ప్రింటింగ్ ఏజెన్సీలు విడుదల చేసిన ఈ తారుమారు లెక్కలపై ఆర్టీఐ కార్యకర్త రాయ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంటే కరెన్సీ నోట్ల ప్రింటింగ్లోనూ, వాటి సరఫరాలోనూ తప్పులుతడకలు చోటుచేసుకున్నాయని ఈ గణాంకాల్లోనే వెల్లడైందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను బాధ్యులుగా చేస్తూ, దీనిపై రాయ్ ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే 2016 జనవరి 27న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనిల్ సింగ్ దాఖలు చేసిన అఫిడవిట్లో పీఎం, ఎఫ్ఎం, ఎంహెచ్ఏ పేర్లను తొలగించాలని పేర్కొన్నారు. 2016 ఆగస్ట్ 23న "సరైన పరిశీలన లేకుండా" జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ స్వప్నా ఎస్ జోషి ఈ పిటిషన్‌ను కొట్టివేశారు. 2016 సెప్టెంబర్ 22న రాయ్ దీనిపై రివ్యూ పిటిషన్ వేశారు. ఈ రివ్యూ పిటిషనే నేడు విచారణకు రానుంది. అయితే రాయ్ ముందు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన 75 రోజుల్లోనే ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పెద్ద నోట్ల రద్దు అవినీతికి వ్యతిరేకంగా, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మోదీ ప్రకటించారు. కానీ అసలు విషయం పెద్ద మొత్తంలో దేశీయ కరెన్సీ నోట్లు మాయమైపోవడమని రాయ్ ఆరోపిస్తున్నారు. -
వాట్సాప్ ను నిషేధించండి...!
వాట్సాప్... ప్రపంచ సమాచార మాధ్యమంగా ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్ ను మెసేజింగ్ యాప్ కోసం విపరీతంగా వినియోగిస్తుంటారు. ఇటు స్కూల్ విద్యార్థుల నుంచి అటు టాప్ మేనేజర్లు, పొలిటికల్ లీడర్ల వరకూ ఈ యాప్ కు బానిసలా మారుతున్నారు. అయితే ఈ యాప్ ను నిషేధించాలని కోరుతూ గుర్గావ్ కు చెందిన 27 ఏళ్ల సమాచార హక్కు కార్యకర్త(ఆర్టీఐ) సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టు గడపతొక్కాడు. వాట్సాప్ యాప్ లో కొత్తగా ప్రవేశించిన ఎన్ క్రిప్షన్ ఫీచర్ ద్వారా టెర్రరిజం, రేవ్ పార్టీ వంటి దుర్వినియోగాలకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరిస్తూ పిల్ దాఖలు చేశాడు.. తను కూడా వాట్సాప్ కు బానిసనేని, కానీ ఈ విప్లవాత్మక ఫీచర్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్, ఇద్దరి మధ్య జరిగే సంభాషణలను మూడో వ్యక్తి తెలుసుకునే వీలు లేకుండా ఉందని, దీనివల్ల దేశ భద్రతకు హానివాటిల్లే ప్రమాదముందని తెలిపాడు. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్ ను) దాఖలు చేశాడు. అనుమానస్పద ప్రజల మధ్య జరిగే సంభాషణలను ఈ ఎన్ క్రిప్షన్ వల్ల ప్రభుత్వం తెలుసుకోలేదని, ఇది దేశభద్రతకు హానికరమని పిల్ లో పేర్కొన్నాడు. "వాట్సాప్ గ్రేట్ యాప్, దానిపై నేను చాలా గంటలను సమయాన్ని వెచ్చిస్తుంటా..కానీ డ్రగ్స్, రేవ్ పార్టీల సమాచారమంతా ఎక్కువగా వాట్సాప్ ద్వారానే జరుగుతుంటుంది. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ను ఉగ్రవాదులు అవకాశంగా మరల్చుకుని, కార్యకలాపాలు చేస్తుంటారు." అని యాదవ్ పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ మూలన కూడా ఉగ్రవాద చర్యలు పాల్పడాల్సినవసరం లేదని, ముఖ్యంగా భారత్ లో ఈ చర్యలను జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని యాదవ్ చెప్పాడు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ ను నిషేధించాలని పిల్ లో సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. హైక్, టెలిగ్రాం, వైబర్ వంటి 20 మెసేజింగ్ యాప్ లపై తన పిటిషన్ దాఖలు చేశాడు. అయితే వాట్సాప్ ఈ ఎక్రిప్షన్ ఫీచర్ ను ప్రారంభించిన ఏప్రిల్ నెల నుంచే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కలెక్టర్ ఆఫీసు ముందే చితకబాదారు
అహ్మదాబాద్: అక్రమ మైనింగ్ ఆగడాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఓ సమాచార హక్కు కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి చావగొట్టారు. గుజరాత్ లోని తాపి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ.. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఆర్టీఐకి దరఖాస్తు చేసుకోవడంతో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తనపై దాడి చేశారని సమాచార హక్కు కార్యకర్త రోమెల్ సుథారియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు డజను మంది తనపై దాడి చేసి.. తన వద్ద ఉన్న పత్రాలను లాక్కెళ్లారని, ఇందులో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆర్టీఐ పత్రాలు కూడా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై గవర్నర్ విచారణకు హాజరయ్యేందుకు తాను కలెక్టర్ కార్యాలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటన ఐపీసీ సెక్షన్లు 143 (అక్రమంగా గుమిగూడటం), 323 (ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం) కింద కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన దుండగులను ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. తాపి జిల్లాలో అక్రమంగా సాగుతున్న మైనింగ్, ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా రోమెల్ సుతారియా పోరాడుతున్నారు. జిల్లాలో 62 అక్రమ మైనింగ్, ఇసుక క్వారీలున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా జిల్లా మైనింగ్ శాఖ అధికారులు వీటికి అనుమతులు ఇచ్చారని ఆయన తెలిపారు. -
ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ కల్పించాలి
సాక్షి, ముంబై: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అనేక అవకతవకలు, కుంభకోణాలను బయటపెట్టిన సామాజిక కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, కొన్ని అసాంఘిక శక్తుల నుంచి వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. దీంతో వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర సమాచార శాఖ కమిషన్ ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విజ్ఞప్తి చేసింది. సమాజ హితవు కోసం సమాచార హక్కు కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వ విభాగాలు, పురపాలక సంస్థల్లో పని చేసే అధికారులు, రాజకీయ నేతలు, పదవీచ్యుతులైన మంత్రుల అవినీతి భాగోతాలను బయటపెట్టిన సందర్భాలునానయి. దీంతో తమ గుట్టు రట్టు చేసిన సమాచార హక్కు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. బెదిరింపులు, పరోక్ష దాడులు జరుగుతున్నాయని సమాచార హక్కు కమిషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. కొద్ది రోజుల కిందట ఆర్టీఐ కార్యకర్త సతీష్ శెట్టిపై దాడి చేసినవారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేసింది. కొన్ని కేసుల్లో దాడులకు పాల్పడిన దుండగుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీంతో సమాచార హక్కు కార్యకర్తలకు భద్రత లేకుండా పోయిందని సమాచార కమిషనర్ రత్నాకర్ గైక్వాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమైన సందర్భంగా ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకొచ్చామని గైక్వాడ్ చెప్పారు. సంబంధిత పోలీసు అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం తమకు హామీ ఇచ్చారని చెప్పారు. -
'చనిపోయిన' వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ తో దొరికాడు
నోయిడా: చనిపోయినట్లు పోలీసులను నమ్మించి, తప్పించుకు తిరుగుతున్న ఆర్టీఐ కార్యకర్త చంద్రమోహన్ శర్మను గ్రేటర్ నోయిడా పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మే 2న జరిగిన కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడని, సామాజిక సమస్యలపై గళమెత్తినందుకే అతణ్ని దండగులు పొట్టనబెట్టుకున్నారని శర్మ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే శర్మ మరణించినట్లు చెబుతున్న రోజునుంచే పొరుగున ఉండే ఓ యువతి కూడా కనిపించకుండా పోవడంతో ఆ దిశగా ప్రారంభించారు. సదరు యువతి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా ఆమె బెంగళూరులో ఉన్నట్లు సమాచారమందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు యువతితో పాటు చంద్రమోహన్ శర్మను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (ఇంగ్లీషులో ఇక్కడ చదవండి)