Nenu C/o Nuvvu Movie To Release On 16th September Deets Inside - Sakshi
Sakshi News home page

Nenu C/o Nuvvu: యదార్ధ సంఘటనల ఆధారంగా ‘నేను c/o నువ్వు'.. రిలీజ్‌ ఎప్పుడంటే

Published Thu, Sep 15 2022 11:00 AM | Last Updated on Thu, Sep 15 2022 11:40 AM

Nenu Co Nuvvu Movie To Release On 16th September - Sakshi

రతన్ కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నేను c/o నువ్వు'. ఆగాపే అకాడమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్‌లు సంయుక్తంగా నిర్మించారు..ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 16 న  గ్రాండ్ గా విడుదల అవుతుంది.

ఈ  సందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత సాగారెడ్డి తుమ్మ  చిత్ర విశేషాల గురించి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. మా సినిమా నుంచి విడుదలైన  మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా  ఉంది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement