బిగ్‌బాస్ సీజన్ టూ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సైరా సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న చిరంజీవి సైరా బ్యాక్‌గ్రౌండ్ పాటతో అదరిపోయేలా గ్రాండ్ ఫినాలెకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ -3 విజేత ఎవరు అనేది మెగాస్టార్ చిరంజీవి ప్రకటిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాబా భాస్కర్ ఎలిమినేట్ కావడంతో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య తుదిపోరు నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరూ విన్నరో మరికాసేపట్లో తెలిపోనుంది. హోస్ట్ నాగార్జునతో కలిసి చిరంజీవి బిగ్‌బాస్ గేమ్ షోలో సందడి చేశారు. శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు గెలుస్తారంటూ హోస్ట్ నాగార్జుననే అడిగి.. చిరు ఇరకాటంలో నెట్టారు. మీరు అడగమన్నారా అంటూ హౌజ్‌లోంచి బయటకొచ్చిన కంటెస్టెంట్లను అడుగుతూ నాగార్జున సరదాగా దాటవేశారు. నాగార్జున హౌజ్‌లోకి వెళ్లి ఫైనలిస్టులైన ఇద్దరు కంటెస్టెంట్లను వేదిక మీదకు తీసుకొచ్చారు. ఇక ఇస్మార్ట్ భామ నిధి అగ్వరాల్ తన దుమ్మురేపే డ్యాన్సులతో గ్రాండ్ ఫినాలెకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment