
రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ఈ పేరు ప్రతీగల్లీలో మారుమోగుతోంది. బిగ్‌బాస్ తెలుగు 3 విజేతగా తన పేరు లిఖించుకున్న రాహుల్ మొదటిసారి లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. అందరూ ఓట్లు వేసి గెలిపించడం వల్లే తన లైఫ్ మారిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ట్రోఫీని సాధించిన రాహుల్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఓ అభిమాని కోరిక మేరకు రాహుల్.. ‘వెన్నెలవే వెన్నెలవే..’ పాట పాడి అందరినీ సంతోషింపజేశాడు. రాహుల్, పునర్నవిల గురించి మరో అభిమాని ప్రస్తావించగా పున్నుతో కలిసి త్వరలోనే లైవ్‌లోకి వస్తానని చెప్పాడు.
తాను గెలుస్తానని ఊహించలేదని, ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులు తోపులని రాహుల్ అభివర్ణించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వరుణ్ గురించి చెప్తూ అతను చాలా మంచోడని చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులందరికీ టాస్క్‌ల్లో బేధాభిప్రాయాలు వచ్చాయే తప్ప అందరూ మంచివాళ్లేనని పేర్కొన్నాడు. ‘నోయెల్ అన్న నీ పక్కన ఉన్నంతవరకు నిన్నెవరూ ఏం చేయలేర’ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి రాహుల్ స్పందిస్తూ.. తనకు ఎంతో మద్దతునిచ్చిన నోయెల్, ఫలక్‌నుమాదాస్ హీరో విశ్వక్‌సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. పున్ను తనను ఘోరంగా సపోర్ట్ చేసిందని, వినకపోతే తిట్టి మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నాడు. పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) లేకపోయుంటే నేనింత కష్టపడకపోయేవాడినని, నా గెలుపుకు వాళ్లు కూడా ఓ కారణమని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment