Bigg Boss 3 Telugu Winner Rahul Sipligunj Debut as an Actor in Krishna Vamsi's Ranga Marthanda Movie | రాహుల్‌కు సినిమా చాన్స్‌ - Sakshi
Sakshi News home page

బిగ్‌స్క్రీన్‌పై గల్లీబాయ్‌

Published Wed, Dec 4 2019 6:45 AM | Last Updated on Wed, Dec 4 2019 11:42 AM

Rahul Sipligunj in Krishna Vamsi Ranga marthanda - Sakshi

బంజారాహిల్స్‌: నిన్నామొన్నటి దాకా తన స్నేహితులతో కలిసి పాతబస్తీ వీధుల్లో తిరిగిన ఓ గల్లీబాయ్‌కి బిగ్‌స్క్రీన్‌పై నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తొలుత ప్లేబ్యాక్‌ సింగర్‌గా చిత్ర సీమకు పరిచయమైన ఈ కుర్రాడు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌–3 విజేతగా నిలిచాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. దాంతో నాలుగైదు వారాల నుంచి యూట్యూబ్‌ స్టార్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ రాహుల్‌ను వెండి తెరకు పరిచయం చేస్తూ సంచలనానికి కేంద్రబిందువయ్యారు. పక్కా లోకల్‌ బాయ్‌గా అభిమానులకు దగ్గరైన రాహుల్‌కు ఈ అవకాశం నిజంగా వరమనే చెప్పాలి.

కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అగ్రనటులు ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నిన్నటిదాకా బుల్లితెరపై సందడి చేసిన రాహుల్‌ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుని అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. స్వతహాగా గాయకుడైన ఇతడు ఇప్పుడు నటుడిగా మారుతుండటంతో అటు పాతబస్తీతో పాటు ఇటు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్విట్టర్‌లోనూ ఇటు ఇన్‌స్ట్రాగామ్‌లోనూ ఆయన అభిమానులు ఈ ఆరందార్రి పంచుకుంటున్నారు. రెండురోజుల నుంచి రాహుల్‌ సోషల్‌ మీడియాలో మారుమోగిపోతున్నాడు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌ లాంటి సీనియర్‌ నటులతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా రాహుల్‌ పేర్కొన్నాడు. 

సంతోషంగా ఉంది
కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా రాహుల్‌ అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ అవకాశం రావడం నిజం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. షూటింగ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, నటుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం నిజంగానే ఆనందంగా ఉందని మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరాడు. తన పాటలతో యువత మనసు దోచుకున్న నేను నటుడిగా మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడంటూ పేర్కొన్నాడు.

ఒక్కసారిగా స్టార్‌డమ్‌..
బిగ్‌బాస్‌–3 విజేతగా నిలిచిన రాహుల్‌ రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయాడు. గాయకుడిగా ఉన్నప్పుడు కొంతమంది అభిమానులను కలిగివున్న ఇతడు బిగ్‌బాస్‌ తర్వాత లక్షలాదిగా వ్యూవర్స్‌ సొంతమయ్యారు. యూట్యూబ్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేస్తున్న వారిలో రాహుల్‌ ఇప్పటికే అందరికంటే ముందున్నాడు. నిన్నామెన్నటిదాకా ఓ సాధారణ గల్లీబాయ్‌గా తిరిగిన రాహుల్‌ ఇప్పుడు సెలబ్రిటీగా అందరి మన్ననలు పొందాడు. గత నెల 29న పీపుల్స్‌ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో తన పాటలతో అదరగొట్టగా ఆ కార్యక్రమానికి వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో రాహుల్‌ భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో రాహుల్‌ నటుడిగా తననుతాను చూపించుకుంటే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అంటున్నారు. ఇప్పటివరకు వెండితెరపై వెలిగిపోయే ఛాన్సు పక్కా హైదరాబాదీకి దక్కడం చాలా అరుదుగా లభించింది. ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ అవకాశాల కోసం ఫిలింనగర్‌లో చెప్పులరిగేలా ఎంతోమంది తిరుగుతున్నారు. అలాంటిది రాహుల్‌కు మాత్రం ఈ అవకాశం వెతుక్కుంటూ రావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement