ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ప్రేమలోకంలో మునిగితేలుతున్నాడు. బిగ్‌బాస్‌లో కలిసిన నటితో రాహుల్ సిప్లిగంజ్ లవ్‌లో పడ్డాడు. ఈ విషయాన్ని ‘సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్’ అంటూ లవ్ సింబల్ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అతడు ప్రేమిస్తున్నది ఎవరినో కాదు బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ అషూ రెడ్డినే. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 షోలో రాహుల్, అషూ కంటెస్టెంట్లు. అయితే అదే షోలోని పునర్నవి భూపాలంతో రాహుల్ ప్రేమలో పడ్డాడని.. దానికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొట్టాయి. పైగా షో తర్వాత కూడా వారిద్దరూ కలిసి చాలా చోట్ల కనిపించడంతో అది నిజమేనని అందరూ నమ్మారు. కానీ అందరి ఊహలకు భిన్నంగా రాహుల్ అషూ రెడ్డితో ప్రేమలో పడ్డానంటున్నాడు. అయితే ఇది ప్రేమా? ప్రమోషనా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అషూ రెడ్డి మోడల్, నటి. డబ్‌స్మాష్‌తో జూనియర్ సమంతగా గుర్తింపు రావడంతో ఆమెకు బిగ్‌బాస్ షోలో అవకాశం వచ్చింది. అనంతరం చల్ మోహన్‌రంగ సినిమాలో ఓ పాత్రలో నటించింది. అమెరికాలోని డల్లాస్‌లో పుట్టిన ఈ భామ బిగ్‌బాస్ అనంతరం పలు షోలతో పాటు యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది. ఇక రాహుల్ విషయానికొస్తే తెలుగు బిగ్‌బాస్-3 విజేతగా నిలిచి ఎంతోమంది ఆదరాభిమానాలు పొందాడు. ఈ షో ద్వారా రాహుల్ కెరీర్ ఒక్కసారిగా టర్నయ్యింది. అంతకుముందు సొంత ఆల్బమ్స్ చేసుకుంటూ యూట్యూబ్‌లో హల్‌చల్ చేసిన ఈ సింగర్ తర్వాత సినిమా పాటలు పాడుతూ ఫుల్ బిజీగా మారాడు. ఇటీవల వస్త్ర వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. అయితే అషురెడ్డి, రాహుల్ మధ్య బిగ్‌బాస్ షోలోనే ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోనున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అందుకే సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ అంటూ రాహుల్ పోస్టు చేశాడని అభిప్రాయపడుతున్నారు. రాహుల్ హీరోగా ‘చిచా’ సినిమా కూడా చేస్తున్నాడు.
బిగ్‌బాస్ కలిపిన ప్రేమ.. తోటి కంటెస్టెంట్‌తో లవ్
Published Tue, Jun 8 2021 8:24 PM | Last Updated on Wed, Jun 9 2021 4:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment