
Bigg Boss Telugu 5, Rahul Sipligunj: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌పై గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో అందరూ ఎవరి సత్తా వారు చూపిస్తున్నారన్నాడు. హౌస్‌లో మనుషులు తక్కువయ్యేకొద్దీ ఎవరు బెస్ట్ అని చెప్పడం కష్టమన్నాడు. తను షో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని, కానీ ఎవరికీ సపోర్ట్ చేయడం లేదన్నాడు. బిగ్‌బాస్ షో మంచిగున్నా, మంచిగ లేకపోయినా చూస్తానని చెప్పుకొచ్చాడు. పక్కింట్లో పంచాయితీ జరిగిందంటే అందరికీ ఆసక్తే అని, ఆ ఆసక్తే షోను చూసేలా చేస్తుందని పేర్కొన్నాడు. గతంలో తను పాల్గొన్న మూడో సీజన్‌కు మంచి టీఆర్పీ వచ్చిందని, కానీ తర్వాత వచ్చిన సీజన్లు ఎప్పటికప్పుడు టీఆర్పీని పెంచుకుంటూ పోతున్నాయన్నాడు.
కాగా ప్రస్తుతం బిగ్‌బాస్ షోలో తొమ్మిది మంది మిగిలారు. వీరిలో ఒకరు నేడు ఎలిమినేట్ అవనున్నారు. అయితే బిగ్‌బాస్‌ను వీడేది యానీ మాస్టర్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment