
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్3 తెలుగు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో తెలుగునాట అందరూ బిగ్‌బాస్ జపం చేస్తున్నారు. ఆయా కంటెస్టెంట్ల అభిమానులు పక్కవాళ్ల ఫోన్లు లాక్కుని మరీ ఓట్లు గుద్దుతున్నారు. అంతేనా, ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్ సమరంలో ఎవరు నెగ్గుతారు? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు వీకెండ్స్‌లో సమాధానం దొరకనుండగా.. ఇప్పటినుంచే జనాలు టీవీలకు అతుక్కుపోయారు.
ఇక శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. అయితే అలీ రెజా, బాబా మాత్రం ఓటింగ్‌లో చాలా వెనుకబడిపోయారు. దీంతో వీళ్లు టైటిల్ రేసు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక వరుణ్‌కు అభిమానుల మద్దతు గట్టిగానే ఉన్నప్పటికీ టైటిల్ గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు మాత్రం రాబట్టుకోలేకపోతున్నాడు. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఒకరిని మించి మరొకరు ఓటింగ్‌లో దుమ్ము లేపుతున్నారు. గత రెండు రోజుల్లో ఓట్లరేసులో కాస్త వెనుకబడ్డ రాహుల్ ప్రస్తుతం శ్రీముఖిని అధిగమించినట్లు సమాచారం. అయితే నేడు కూడా ఓటింగ్‌కు అవకాశం ఉండటంతో ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. మరి టైటిల్‌ను అందుకుని గెలుపును ముద్దాడేది ఆమెనా, అతడా? అన్నది ఆదివారం తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment