బిగ్‌బాస్ షోలో ముఖ్యమైన ఘట్టం టికెట్ టు ఫినాలే. నిజంగానే టికెట్ టు ఫినాలే గెలవడం అవసరమా? ఇది గెలవకుండా ఫినాలేలో అడుగుపెట్టలేరా? ఇది గెలిచినవారు ఇంతకుముందు ఎవరైనా కప్పు కొట్టారా? లేదా? ఈ వివరాలన్నీ ఓసారి చదివేద్దాం..
బలమైన కంటెస్టెంట్‌కు భారీ అభిమానగణం తోడైతే వారికి టికెట్ టు ఫినాలే అవసరమే లేదు. అది లేకుండానే ఈజీగా ఫినాలేకు వెళ్లొచ్చు. కానీ రిస్క్, టెన్షన్ లేకుండా టాప్ 5లో చోటు దక్కించుకోవాలంటే మాత్రం టికెట్ టు ఫినాలే గెలుచుకోవాల్సిందే! నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన మొదటి సీజన్‌లో టికెట్ టు ఫినాలే ప్రస్తావనే లేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫినాలేలో మొదటగా అడుగుపెట్టాడు. కానీ విజేతగా అవతరించలేకపోయాడు.
నాగార్జున హోస్ట్‌గా చేసిన మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని మొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. అంతేకాకుండా ఆ సీజన్ విజేతగానూ అవతరించాడు. ఈ టికెట్ గెలిచి కప్పు కొట్టిన మొట్టమొదటి వ్యక్తిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. నాలుగో సీజన్‌లో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ సార్థక్ రన్నరప్‌గా నిలిచాడు. ఐదో సీజన్‌లో శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే సాధించాడు. కాకపోతే ఓ టాస్క్‌లో శ్రీరామ్ కాళ్లు సహకరించకపోవడంతో అతడి తరపున సన్నీ, షణ్ముఖ్‌లు టాస్క్‌లు పూర్తి చేసి అతడిని గెలిపించడం విశేషం.
ఈ ఐదు సీజన్స్ గమనిస్తే టికెట్ టు పినాలే గెలిచినవారిలో రాహుల్ సిప్లిగంజ్ మినహా ఎవరూ విజేతలుగా నిలవలేకపోయారు. అఖిల్ ఒక్కడే కనీసం రన్నరప్ దాకా వచ్చి ఆగిపోయాడు. మరి ఈ సీజన్‌లో శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి అతడు విన్నర్ లేదా రన్నర్ అవుతాడా? ప్రస్తుతం అనధికారిక పోల్స్ చూస్తే రేవంత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఉన్న కొద్ది రోజుల్లో తన గ్రాఫ్ పెంచుకుని శ్రీహాన్ విన్నర్ అవుతాడా? కనీసం రన్నరప్‌గా అయినా నిలుస్తాడా? అనేది చూడాలి!
చదవండి: మహేశ్‌బాబుతో మాట్లాడా, ఆయన అలా అనేసరికి కన్నీళ్లొచ్చాయి
ఆ ముగ్గురూ వేస్ట్, అంత భయముంటే బిగ్‌బాస్‌కు రావొద్దు: రేవంత్
Comments
Please login to add a commentAdd a comment