
బిగ్‌బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ షో తర్వాత వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇటు సింగర్, అటు నటుడిగా రాహుల్ ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాహుల్ కృష్ణవంశీ 'రంగమార్తాండ'లో నటిస్తున్నాడు. అలాగే సోలో హీరోగా కూడా చేయబోతున్నాడు. పాటలు, నటనతో పాటు వ్యాపారంపై కూడా రాహుల్ సిప్లిగంజ్ దృష్టి పెట్టాడు. ఊకో కాక అనే బ్రాండ్ పేరుతో వ్యాపారాన్ని మొదలెట్టాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊకో కాక బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో తన కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు రాహుల్.
సిద్దిపేట ఊకో కాక మెన్స్ వేర్ బ్రాంచ్‌ను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తాను హీరోగా నటించబోతున్న ‘చిచ్చా’మూవీ పోస్టర్, టైటిల్ సాంగ్‌ని మంత్రి హరీశ్‌రావు లాంచ్ చేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘సినిమా టైటిల్ బాగుంది. చిచ్చా తెలంగాణ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేలా ఉంది. రాహుల్ మన తెలంగాణ బిడ్డ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా నేను చేస్తాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్‌కు ఎదగాలి. బిగ్ బాస్ షోను ఎలా హిట్ చేశాడో.. సినిమాను కూడా అలాగే హిట్ చేయాలి’ అని కోరుకున్నారు.
ఇక చిచ్చా సినిమా సాంగ్ విషయానికొస్తే.. బచ్చా, లుచ్చా అనే పక్కా తెలంగాణ పదాలతో మాస్ ట్యూన్‌గా సాగే పాట ఇది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను సంగీత దర్శకుడైన వేంగి రాసి కంపోజ్ చేశారు. ఆర్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్‌పై రాబోతోన్న ఈ మూవీని మల్లిక్ కందుకూరి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలన్నీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment