బిగ్‌బాస్ హౌస్‌లో అతి చేస్తున్న కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారా? అంటే చాలామంది పేర్లు వినిపిస్తాయి. అయితే అంతుచిక్కని ప్రవర్తనతో అపరిచితురాలిగా మారుతూ అందరినీ చిరాకు పెట్టే కంటెస్టెంట్లలో తొలిస్థానంలో ఉంటుంది రతిక. మొదట్లో అమ్మాయి బాగుంది, ఆటాడితే ఇంకా బాగుంటుంది అనుకున్నారంతా! తను కూడా అదే చేసింది.. కానీ బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్ ఆడకుండా హౌస్‌మేట్స్‌తో ఆడింది. వారి సహనానికి పరీక్ష పెడుతూ మొండిగా ప్రవర్తిస్తూ ముప్పతిప్పలు పెట్టింది.
ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు?
ఇప్పుడేమో హౌస్‌లో లవ్ ట్రాక్‌లు నడుపుతూ, వెనకాల వెన్నుపోటు పొడుస్తూ డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇదంతా పక్కనపెడితే రతిక ఆ మధ్య తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పదే పదే అతడి గురించే ప్రస్తావిస్తోంది. అతడు గుర్తొస్తే తన మైండ్ పని చేయడమే ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. అతడు సింగర్ అని కూడా హింటిచ్చింది. చివరకు ఆ సింగర్ మరెవరో కాదు, రాహుల్ సిప్లిగంజ్ అంటూ నెట్టింట ఫోటోలు కూడా లీకయ్యాయి. తాజాగా దీనిపై రాహుల్ స్పందించిన సంగతి తెలిసిందే! ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? కొందరు పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారు అని మండిపడ్డాడు.
ముందే ప్లాన్ చేసుకున్నారా?
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోలు లీక్ అవడంపైనా అనుమానం వ్యక్తం చేశాడు. 'నాకో డౌట్.. ఆరేళ్ల తర్వాత సడన్‌గా వారి పర్సనల్ ఫోన్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లోకి ఎలా వచ్చాయి? అంటే.. లోపలికి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా? సమాధానమేంటో మీకే అర్థమవుతుందనుకుంటా! అక్కడున్నది అబ్బాయైనా, అమ్మాయైనా వారి జీవితాలతో నాకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు.
ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది!
అలాంటిది.. ఇలా ఫోటోలు లీక్ చేసి ఇబ్బంది పెట్టేముందు క్షణం ఆలోచించాల్సింది. ఎదుటివ్యక్తి కుటుంబం, స్నేహితులు దీని వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారని ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. అసలేం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పు? ఒప్పు? అని డిసైడ్ చేయకండి. ఇది అర్థం చేసుకున్నవారికి థాంక్యూ.. లేదు, విషాన్ని చిమ్ముతామనుకునేవారికి ఆల్ ద బెస్ట్' అని రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment