Attack on Bigg Boss 3 Telugu Winner Rahul Sipligunj at Hyderabad Prism PUB - Sakshi
Sakshi News home page

రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి

Published Thu, Mar 5 2020 6:32 AM | Last Updated on Thu, Mar 5 2020 11:30 AM

Attack On Rahul Sipligunj In pub - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాయకుడు, బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి  వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి.  రాహుల్‌పై బీరు సీసాలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా  గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బంధువులతో రాహుల్‌ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారు రాహుల్‌పై దాడి చేసినట్లు సమాచారం.. గచ్చి బౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం రాహుల్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. తనకు ఏమీ కాలేదని.. చిన్న గాయమే అయిందని  తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రాహుల్‌ వెళ్లిపోయారు. పబ్‌లో గొడవపై సుమోటోగా కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement