‘రాహుల్‌ లిప్‌లాక్‌ సీన్‌ వైరల్‌..’  | Rahul Sipligunj Lip Lock Scene With Nandini Roy Video Viral In Social Media | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌ లిప్‌లాక్‌ సీన్‌ వైరల్‌.. నేను సచ్చిపోతా’ 

Published Fri, Apr 17 2020 2:32 PM | Last Updated on Fri, Apr 17 2020 6:14 PM

Rahul Sipligunj Lip Lock Scene With Nandini Roy Video Viral In Social Media - Sakshi

రాహుల్‌ సిప్లిగంజ్‌ పెద్దగా పరిచం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 తర్వాత అతడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. దీంతో అటు సింగర్‌గా, నటుడిగా, ప్రయివేట్‌ ఆల్బమ్స్‌తో చాలా బిజీ అయిపోయాడు. అంతేకాకుండా తరుచూ వార్తల్లో నిలిచే రాహుల్‌ తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఓ పాత వీడియో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై రాహుల్‌లో ఈ యాంగిల్‌ కూడా ఉందా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఆరేళ్ల కిందట బిగ్‌బాస్‌-2 భామ నందినీ రాయ్‌తో కలిసి రాహుల్‌ ఓ ప్రయివేట్‌ ఆల్బమ్ చేశాడు. ఈ పాటలో నందినీతో రోమాన్స్‌ చేయడంతో పాటు లిప్‌ లాక్‌ సీన్‌ చేశాడు. 

అయితే అప్పుడెప్పుడో నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ తన ఇన్‌స్టాలో తాజాగా పంచుకున్నాడు. ఈ వీడియోలో ఇద్దరు లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న సీన్ చూసుకుని నవ్వుకున్న వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన మరో బిగ్‌బాస్‌ భాం అషూ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'వావ్ ఇది నేను చూడలే' అని కామెంట్ చేయగా.. దీనికి రాహుల్.. 'అబ్బో ఇక నేను చచ్చిపోతా' అంటూ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీనికి మళ్లీ స్పందించిన అషూ.. 'మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో' అంటూ స్మైలీ ఎమోజీ జత చేసింది. ఇక మరికొంత మంది నెటిజన్లు పున్ను(పునర్నవి భూపాలం) ఈ వీడియో చూస్తే రాహుల్‌ పరిస్థితేంటో అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. 

చదవండి:
‘వి’ డైరెక్టర్‌తో చైతూ చిత్రం?
‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement