రతికతో బ్రేకప్‌పై రాహుల్‌ సిప్లిగంజ్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Rahul Sipligunj's First Reaction On His Break Up With Rathika Rose - Sakshi
Sakshi News home page

Rahul Sipligunj: ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది.. రతికతో బ్రేకప్‌పై రాహుల్‌ రియాక్షన్‌ ఇదీ!

Published Thu, Nov 9 2023 4:34 PM | Last Updated on Sat, Nov 11 2023 3:48 PM

Rahul Sipligunj First Reaction On His Break up With Rathika Rose - Sakshi

రతిక రోజ్‌.. బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ప్రారంభంలో అందరినీ ఆకట్టుకుంది. సూటిగా, ధైర్యంగా.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ ప్రియులకు బాగా కనెక్ట్‌ అయింది. తర్వాత ప్రశాంత్‌తో పులిహోర కలపడం.. అందరిముందు మాత్రం మొత్తం నువ్వే చేశావ్‌ అంటూ అతడిని దోషిగా నిలబెట్టడం.. తనను చులకన చేసి మాట్లాడటం.. పదేపదే తన మాజీ ప్రియుడి ప్రస్తావన తేవడం.. ముందు ఒకలా, వెనక ఒకలా ప్రవర్తించడం.. ఇలా వరుస తప్పులు చేస్తూ పోవడంతో తన గ్రాఫ్‌ అమాంతం పాతాళంలోకి పడిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్‌ అయింది. కానీ బిగ్‌బాస్‌ టీమ్‌ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్‌ ఇచ్చింది. దాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతోంది రతిక.

రతిక గురించి తొలిసారి మీడియాతో..
ఇక ఆమె హౌస్‌లో ఉండగా రతిక తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో లీకవగా పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై రాహుల్‌ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ప్రోగ్రామ్‌కు హాజరైన రాహుల్‌.. రతికతో బ్రేకప్‌పై తొలిసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు.

రతికకు ఆల్‌ద బెస్ట్‌ చెప్పిన రాహుల్‌
ఆమెతో పాటు హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కు నేను ఆల్‌ద బెస్ట్‌ చెప్తున్నాను. బాగా ఆడి కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నాను. విన్నర్‌ ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేము. ప్రస్తుతానికైతే భోలె షావళి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తిలా ఉన్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ ఒకప్పుడు బిగ్‌బాస్‌ షోను ప్రేక్షకుడిలా చూశాడు. ఇప్పుడు ప్రేక్షకులు ఆయనను బిగ్‌బాస్‌ హౌస్‌లో చూస్తున్నారు' అని మాట్లాడాడు రాహుల్‌ సిప్లిగంజ్‌.

చదవండి: 10 ఏళ్లకే ఫుల్‌ క్రేజ్‌.. 17 ఏళ్లకే తల్లయిన స్టార్‌ హీరోయిన్‌.. అర్ధాంతరంగా ముగిసిన కెరీర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement