
బిగ్‌బాస్ షోలో గేమ్స్ ఒక్కటే కీలకం కాదు.. వ్యక్తిత్వం, ప్రవర్తన కూడా ముఖ్యమే! చిన్నచిన్న పొరపాట్లనే భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. చికాకు తెప్పించే కంటెస్టెంట్లను అస్సలు సహించరు. అలా ఈ సీజన్‌లో చాలామందిని బయటకు పంపించేశారు. తాజాగా మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది.
రిస్క్ తీసుకోవడం అవసరమా?
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో పన్నెండో వారం ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు. ప్రియాంక, శోభ మినహా అందరూ నామినేషన్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో అశ్విని తెలివితక్కువ పని చేసింది. సిల్లీ కారణాలతో ఎవరినీ నామినేట్ చేయలేనంటూ తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. అసలే తనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. టాస్క్‌ల్లోనూ పెద్దగా పర్ఫార్మ్ చేసింది లేదు. పైగా ప్రతిదానికీ ఏడుస్తూ క్రైయింగ్ బేబీగా మారింది.
కొంప ముంచిన సెల్ఫ్ నామినేసన్
పైగా ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో సెల్ఫ్ నామినేట్ చేసుకుని డేంజర్ జోన్‌లో ఉండటం అవసరమా? మళ్లీ ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని భయంతో వణికిపోతోంది. చివరకు ఆమె భయమే నిజమైంది. ఈవారం అశ్విని ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.. ఈ రోజు ఎపిసోడ్‌లోనే ఆమె ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో రతిక కూడా ఎలిమినేట్ అయిందంటున్నారు. మరి అది నిజమా? కాదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే!
చదవండి: దొరికిపోయిన సోఫాజీ.. ముసుగు ఊడిపోయింది.. విన్నర్ రేసులో నుంచి అవుట్
Comments
Please login to add a commentAdd a comment