బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. నో ఎలిమినేషన్‌ | Bigg Boss 7 Telugu: Is There Elimination in 11th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: ఎలిమినేషన్‌ ఎత్తేసిన బిగ్‌బాస్‌.. వాళ్లను కాపాడుకోవడానికే!

Published Sat, Nov 18 2023 7:01 PM | Last Updated on Sat, Nov 18 2023 7:39 PM

Bigg Boss 7 Telugu: Is There Elimination in 11th Week - Sakshi

బిగ్‌బాస్‌ షోలో కొన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. షో ప్రారంభమైన తొలి వారాల్లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఇట్టే పసిగట్టేస్తుంటారు. కానీ రానురానూ ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది చెప్పడం చాలా కష్టం. ఎవరికి వారు తమకంటూ సొంత ఫ్యాన్‌బేస్‌ ఏర్పాటు చేసుకుంటారు. గెలుపు కోసం తెగ కష్టపడుతుంటారు, ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. వారి మధ్య పోటీ పెరగడంతో ఎలిమినేషన్‌ను అంచనా వేయడం చాలా కష్టమవుతుంది. కానీ ఈ సీజన్‌లో దాదాపు అన్ని ఎలిమినేషన్స్‌ ఊహించినట్లే జరుగుతున్నాయి. నయని పావని, సందీప్‌, భోలె షావళి ఎలిమినేషన్స్‌ మాత్రమే కాస్త అటూఇటుగా జరిగాయి.

ఎవిక్షన్‌ పాస్‌ వెనక్కు
ఇక ఈ వారం ఎవరు మూటాముళ్లె సర్దుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ బిగ్‌బాస్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ప్రవేశపెట్టడం.. అది యావర్‌ గెల్చుకోవడంతో ఎలిమినేషన్‌ మరింత ఉత్కంఠగా మారింది. కానీ బిగ్‌బాస్‌ తలిచింది వేరు.. ఆ పాస్‌ లేడీ కంటెస్టెంట్‌ గెలుచుకోవాలని ప్రయత్నించాడు. అందుకే ఒకటీ రెండు కాకుండా బోలెడన్ని గేమ్స్‌ పెట్టాడు. అయినా చివరకు యావరే గెలిచాడు. అయితే ఓ గేమ్‌లో యావర్‌ చేసిన తప్పును నేడు నాగార్జున వీడియో వేసి చూపించాడు. దీంతో తనది ఫౌల్‌ గేమ్‌ అని ఒప్పుకుని ప్రిన్స్‌ తన పాస్‌ను వెనక్కు ఇచ్చేశాడు. కానీ అంతలోనే సర్‌ప్రైజ్‌.. అంటూ పాస్‌ తిరిగిచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

డేంజర్‌ జోన్‌లో అమ్మాయిలు.. అనూహ్య నిర్ణయం తీసుకున్న బిగ్‌బాస్‌
అయితే ఈ వారం శివాజీ, ప్రశాంత్‌ తప్ప మిగిలిన అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో అమర్‌దీప్‌, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌, ప్రియాంక సేఫ్‌ జోన్‌లో ఉన్నారు. రీఎంట్రీ తర్వాత పెద్దగా ప్రభావం చూపని రతిక ఎలిమినేట్‌ కానుందని ప్రచారం జరిగింది. కానీ చివర్లో అశ్విని, శోభాలలో ఎవరో ఒకరిని బయటకు పంపించనున్నట్లు టాక్‌ నడిచింది. అయితే ఇవేవీ కాదని బిగ్‌బాస్‌ అనూహ్య ట్విస్ట్‌ ఇచ్చాడు. ఎలిమినేషన్‌ ఎత్తేశాడు. ఈవారం ఎవరినీ బయటకు పంపించలేదు. అమ్మాయిలను హౌస్‌లో ఉంచడానికే బిగ్‌బాస్‌ ఈ ప్లాన్‌ వేసినట్లు స్పష్టమవుతోంది.

చదవండి: నీతులు చెప్తూ బూతులు మాట్లాడుతున్న శివాజీ.. ఈసారైనా నాగ్‌ కోటింగ్‌ ఇస్తాడా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement