
మిత్రాశర్మ హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన చిత్రం 'బాయ్స్'. గీతానంద్ హీరోగా నటించాడు. ఈ సినిమాలోని రాజా హే రాజా అంటూ సాగే ఓ యూత్‌ఫుల్ కాలేజీ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను శ్రీమణి రచించగా, బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. స్మరన్ సంగీతం అందించాడు.
మిత్రా శర్మ మాట్లాడుతూ.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. రాహుల్ సిప్లిగంజ్‌కు ఉన్న క్రేజ్, ట్యూన్‌లో ఉన్న కిక్ 'రాజా.. హే రాజా..' పాట పెద్ద హిట్టవ్వడానికి కారణమయ్యాయి. మా దర్శకుడు దయా చాలా చక్కగా చిత్రీకరించాడు. సినిమాలోని పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. మా చిత్రం సహనిర్మాత పడవల బాలచందర్ ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. సినిమా విడుదల తేదీ, ఇతర వివరాలను త్వరలో చెబుతాం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment