ఆ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్‌ అయితే అఖిలే విన్న‌ర్‌! | Bigg Boss 4 Telugu: If This Sentiment Works, Akhil Will Be The Winner | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అప్పుడు రాహుల్‌, ఇప్పుడు అఖిల్‌!

Published Thu, Dec 3 2020 5:46 PM | Last Updated on Fri, Dec 4 2020 1:22 AM

Bigg Boss 4 Telugu: If This Sentiment Works, Akhil Will Be The Winner - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఫిజిక‌ల్‌గా స్ట్రాంగ్ ఎవ‌రు? అన‌గానే మొద‌ట మెహ‌బూబ్‌, అఖిల్ పేర్లే వినిపిస్తాయి. మెహ‌బూబ్ ఎలాగో వెళ్లిపోయాడు కాబ‌ట్టి అఖిల్ గురించి చెప్పుకుందాం. అఖిల్‌‌.. టాస్క్ అన‌గానే త‌న శ్ర‌మ‌నంతా ధార‌పోసి ఎలాగైనా గెల‌వాల‌న్న క‌సితో ఆడ‌తాడు. అలా చాలా టాస్కుల‌ను గెలిచాడు కూడా! కానీ ఇప్పుడు గెల‌వాల్సిన‌వి టాస్కులు మాత్ర‌మే కాదు, ప్రేక్ష‌కులు మ‌న‌సులు కూడా! చిన్న‌వాటికి ఎమోష‌న‌ల్ అయ్యే అఖిల్ గోటితో పోయేవాటిని గొడ్డ‌లిదాకా తెచ్చుకుంటున్నాడు. చిన్న‌చిన్న గొడ‌వ‌ల‌ను కూడా భూత‌ద్దంలో చూస్తాడు. షో ముగింపుకు చేరుకుంటున్న ఈ స‌మ‌యంలో ఇలాంటివ‌న్నీ ప‌క్క‌న‌పెడితేనే మంచిది. మ‌న‌సు, మెద‌డును ప్ర‌శాంతంగా ఉంచుకుంటూ గేమ్ ఆడ‌గ‌లిగితే అంత‌లా విజ‌యానికి చేరువ‌వుతాడు. ముఖ్యంగా అభిజిత్‌తో గొడ‌వ‌ప‌డ‌క‌పోతే మ‌రీ మంచిది. లేదంటే అఖిల్‌ తీర‌ని న‌ష్టాన్ని చ‌విచూడ‌క త‌ప్ప‌దు.

సాధించాల‌న్న క‌సితో బిగ్‌బాస్‌కు..
ఈ సీజ‌న్‌లో కొంద‌రు బిగ్‌బాస్ ఎలా ఉంటుందో చూద్దామ‌ని వ‌చ్చారు. మ‌రికొంద‌రు రెండుమూడు వారాలే ఉంటామంటూ ఏదో పిక్నిక్‌కు వ‌చ్చిన‌ట్లు వ‌చ్చి వెళ్లిపోయారు. అయితే అఖిల్ అలాంటి కోవ‌కు చెందిన వ్య‌క్తి కాదు. త‌నేంటో నిరూపించుకుని, ఏదైనా సాధించాల‌న్న క‌సి, త‌ప‌న‌తో బిగ్‌బాస్‌లో అడుగు పెట్టాడు. ఇక‌పోతే అత‌డు ఇత‌ర భాష‌ల్లోని బిగ్‌బాస్ సీజ‌న్ల‌ను చూశాడ‌ని ఆమె త‌ల్లే చెప్పింది. అందుకే కొన్నిసార్లు ఏది జ‌రుగుతుంది? ఏది జ‌ర‌గ‌దు అనేది ముందుగానే ఊహిస్తూ అందుకు త‌గ్గ‌ట్టుగా నిర్ణ‌యం తీసుకుంటాడు. అందుకు ఉదాహ‌ర‌ణే సీక్రెట్ రూమ్‌. (చ‌ద‌వండి: సోహైల్‌, అరియానా టాప్ 2లో ఉండాలి: రాహుల్)‌

ల‌వ్ ట్రాక్ అట‌కెక్కించాడు
ముందుగా అఖిల్ ప్ర‌యాణం మొద‌టి నుంచి చూసిన‌ట్లైతే.. అత‌డు ప్రారంభంలో మోనాల్‌తో ల‌వ్‌ట్రాక్ న‌డిపి ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ రానురానూ ఆమె వ‌ల్ల త‌న గేమ్ డిస్ట‌ర్బ్ అవుతోంద‌ని గ్ర‌హించి మోనాల్‌ను ప‌క్క‌న‌పెట్టాడు. పూర్తిగా గేమ్‌లో దిగాడు. ఎవ‌రి స‌పోర్ట్ లేకుండానే గేమ్ ఆడాడు.‌ అయితే ఎప్పుడైతే సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడో అక్క‌డ అఖిల్ గ్రాఫ్ ప‌డిపోవడం ప్రారంభ‌మైంది. హౌస్‌లో ఉన్న‌ అంద‌రూ వీక్, త‌నే స్ట్రాంగ్ అని ప్ర‌గల్భాలు ప‌గ‌ల‌డం చాలామందికి కోపం తెప్పించింది. పైగా హౌస్‌లోకి వెళ్లాక కూడా గొడ‌వ‌లు, వివాదాల్లో మునిగి వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ టాస్కులు ఆడుతూ, ఎలాంటి గొడ‌వ‌లో దూర‌కుండా స్థిరంగా ఉంటున్నాడు. (చ‌ద‌వండి: నీ వ‌ల్ల చాలా హ‌ర్ట్ అవుతున్నా: అభి)

ఫినాలేలో తొలుత అడుగు పెట్టిన రాహుల్
అయితే గ‌త సీజ‌న్‌లో రాహుల్ సిప్లిగంజ్ కూడా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. తిరిగి హౌస్‌లోకి అడుగుపెట్టాక త‌న గేమ్ ప్లాన్‌నే మార్చి విజ‌యానికి చేరువ‌య్యాడు. అంతే కాకుండా టికెట్ టు ఫినాలే సంపాదించి టాప్ 5లోకి మొద‌ట‌గా అడుగు పెట్టాడు. ఆఖ‌రికి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇక‌పోతే ఈ సీజ‌న్‌లో అఖిల్ సీక్రెట్ రూమ్‌కి వెళ్లి వ‌చ్చాడు. అలాగే టికెట్ టు ఫినాలే రేసులో అఖిలే గెలిచాడ‌ని సోష‌ల్ మీడియా ట‌ముకేసి మ‌రీ చెప్తోంది. అదే క‌న‌క నిజ‌మైతే  అఖిల్ కూడా రాహుల్ లాగే టాప్ 5కి చేరుకునే మొద‌టి కంటెస్టెంటుగా నిలిచిపోతాడు. సీక్రెట్ రూమ్‌, టికెట్ టు ఫినాలే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే ఈసారి అఖిలే గెలుస్తాడ‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. మరి ఏమ‌వుతుందో చూడాలి! (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అఖిల్‌కు షాకిచ్చిన మోనాల్ త‌ల్లి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement