Pawan Kalyan Wrote Special Letter To Bigg Boss 3 Himaja | బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజకు లేఖ‌ - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజకు పవన్‌ కళ్యాణ్‌ లేఖ‌

Published Mon, Mar 1 2021 2:12 PM | Last Updated on Wed, Mar 3 2021 6:34 PM

Pawan Kalyan Sent A Letter To Bigboss Fame Himaja, Post Viral - Sakshi

అభిమాన హీరో సినిమాలో నటించే చాన్స్‌ వస్తేనే ఆనందంలో మునిగిపోతారు. అలాంటిది ఆ హీరో దగ్గరనుంచి బహుమతి అందితే? ఆ ఆనందాన్ని మాటల్లో వివరించలేము. బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ ప‌రిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. తానెంతో ఆరాధించే హీరో పవన్‌కళ్యాణ్‌ నుంచి హిమజకు ఓ లెటర్‌ వచ్చింది. అందులో ‘నటి హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని పవన్‌ బెస్ట్‌ విషెస్‌ అందజేస్తూ లేఖ రాశారు. ఇది స్వయంగా పవన్‌ కళ్యాణే రాయడం విశేషం.  దీంతో హిమజ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.  పవన్‌ రాసిన లేఖను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన హిమజ..తన ఆనందాన్ని మాటలు,ఎమోజీల్లో చెప్పలేకపోతున్నానని పేర్కొంది. గతంలోనూ తన సినిమాల్లో పనిచేసిన పలువురు నటులకు పవన్ కళ్యాణ్ బెస్ట్ విషెస్ ను అందించిన విషయం తెలిసిందే.


ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ - క్రిష్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఓ పీరియాడికల్ చిత్రంలో హిమజ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పవన్‌తో తీసుకున్న సెల్ఫీని ఇటీవలె ఆమె షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.  కాగా పవన్‌-క్రిష్‌ల సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజ్‌ చేయనున్నామని చిత్రయూనిట్‌ ప్రకటించింది.ఈ చిత్రంలో ఆయన వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. పవన్‌ సరసన శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారుసంక్రాంతి కానుకగా ఈ సినిమాను  రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రం​ సంక్రాంతి కానుకగా పప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి : (షాకింగ్‌ లుక్‌లో జయసుధ.. ఆందోళనలో ఫ్యాన్స్‌!)
(స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement