పునర్నవి ఔట్‌.. స్టెప్పులేసిన హిమజ | Bigg Boss 3 Telugu Punarnavi Eliminated Himaja Happy | Sakshi
Sakshi News home page

పునర్నవి ఔట్‌.. స్టెప్పులేసిన హిమజ

Published Mon, Oct 7 2019 2:34 PM | Last Updated on Wed, Oct 9 2019 4:47 PM

Bigg Boss 3 Telugu Punarnavi Eliminated Himaja Happy - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్-3లో భాగంగా పదకొండో వారం పునర్నవి భూపాలం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. అందరూ ఊహించినట్టే పునర్నవికి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌ బాస్‌ హౌజ్‌ వీడాల్సి వచ్చింది. ఇక పునర్నవి ఎలిమినేట్‌ కావడంతో రాహుల్‌ సిప్లిగంజ్‌ వెక్కివెక్కి ఏడ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో మరోసారి బయటపడింది. కాగా, పునర్నవి ఎలిమినేట్‌ కావడంతో హిమజ తెగ ఆనంద పడుతోంది. పునర్నవి కంటే రెండు వారాల ముందే ఎలిమినేట్‌ అయిన హిమజ.. తాజాగా పునర్నవి ఎలిమినేట్‌ కావడంతో ఎగిరిగంతేసింది. పునర్నవి ఎలిమినేట్‌ అయిందని నాగార్జున ప్రకటించడంతో హిమజ టీవీ ముందుకు వచ్చి స్టెప్పులేసింది. 

ఇక దీనికి సంబంధించిన వీడియోను హిమజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అంతేకాకుండా పునర్నవి యాక్షన్‌కు తన రియాక్షన్‌ ఇదే  నంటూ కామెంట్‌ జతచేసింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. చిల్లర వేశాలంటూ పునర్నవి అభిమానులు హిమజపై మండిపడుతున్నారు. అంతేకాకుండా షోలో భాగంగా నాగార్జున షూ పాలీష్‌ చేసినప్పుడు, ఇంటి సభ్యుల బంధువులు హౌజ్‌లోకి వచ్చినప్పుడు కూడా హిమజ ఇలాగే ఓవరాక్షన్‌ చేసిందని గుర్తుచేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం హిమజకు మద్దతుగా నిలుస్తున్నారు.

కాగా, బిగ్‌ బాస్‌ హౌజ్‌లో హిమజ-పునర్నవిల మధ్య ఎప్పుడూ ముఖ్యంగా నామినేషన్‌ సమయంలో యుద్ధ వాతావరణం ఉండే విషయం తెలిసిందే. ఇక హిమజ బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకి వచ్చాక ఇంటి సభ్యుల గురించి, హౌజ్‌ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అంతేకాకుండా తను పాల్గొన్న పలు కార్యక్రమాల్లో కూడా ఇంటి సభ్యులపై ఆసిక్తికర కామెంట్స్‌ చేస్తూ అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement