బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా? | Bigg Boss 3 Telugu Nominations : Is Himaja Intentionally Did For Mahesh | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

Published Tue, Sep 17 2019 1:23 PM | Last Updated on Tue, Sep 17 2019 2:43 PM

Bigg Boss 3 Telugu Nominations : Is Himaja Intentionally Did For Mahesh - Sakshi

తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్‌ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్‌లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్‌ కొన్ని మార్పులు మాత్రమే చేశాడు. అప్పుడు కూడా టెలిఫోన్‌ బూత్‌ను ఏర్పాటు చేసి ఒక్కో హౌస్‌మేట్స్‌ను పిలిచి నేరుగా నామినేట్‌ చేశాడు. అయితే నామినేషన్‌లోంచి తప్పించుకోవడానికి ఓ అవకాశమిస్తున్నట్లు చెప్పి.. మిగతా హౌస్‌మేట్‌లోంచి ఒకరి చేత తాను చెప్పిన పనిని చేయించాల్సి ఉంటుందని షరతును విధించాడు.

దీనిలో భాగంగా రెండో సీజన్‌లో గీత మాధురి బిగ్‌బాస్‌ ట్యాటూ వేయించుకోగా.. ఈసారి శ్రీముఖి వేయించుకుంది. తనీష్‌ తనకు ఇష్టమైన జాకెట్‌ను పెయింట్‌లో ముంచగా.. ఈసారి రవి తనకిష్టమైన షూలను పెయింట్‌లో ముంచాడు. తేజస్వీ కోసం సామ్రాట్‌ క్లీన్‌ షేవ్‌ చేయించుకోగా.. శ్రీముఖి కోసం బాబా భాస్కర్‌ క్లీన్‌ షేవ్‌ చేసుకున్నాడు. అయితే మహేష్‌ నామినేషన్‌ విషయానికొచ్చేసరికి మాత్రం తేడా కొట్టేసింది.

గతంలో కూడా ఇలాంటిది ఇచ్చిన బిగ్‌బాస్‌.. మరోసారి చెక్‌ చేయమని చెప్పలేదు. ఈసారి కెప్టెన్‌ అయిన వితికాను.. హిమజకు సంబంధించిన వస్తువులు, బట్టలు ఏమైనా ఉంటే చూసి చెప్పండని ఆదేశించాడు. దీంతో హిమజకు సంబంధించిన మేకప్‌ వస్తువులు, కొన్ని బట్టలు మిగలడంతో ఆ విషయాన్ని బిగ్‌బాస్‌కు తెలిపింది. దీంతో మహేష్‌ నామినేట్‌ అయినట్లు తేల్చేశాడు. అయితే హిమజ కావాలనే ఇలా చేసిందని కొందరు అంటుండగా.. కాదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా హిమజ చేసిన ఈ పనితో మహేష్‌ నామినేషన్‌లోకి వచ్చేశాడు. దీంతో హిమజపై ప్రస్తుతం ఫుల్‌ నెగెటివిటీ పెరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement