
సాక్షి, పంజగుట్ట: బిగ్‌బాస్‌లో ఓటింగ్ చూస్తుంటే అభిజిత్ గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుందని బిగ్‌బాస్ 3 ఫేం హిమజ అన్నారు. కాని ఒక మహిళగా అరియానా లేదా హారిక గెలవాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. మాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రముఖ నటి హిమజ సందడి చేసింది. షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెల్లరీ షోను ఆమె శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా షోరూం మొత్తం కలియ తిరిగి ఆభరణాలను పరిశీలించింది. బరువు తక్కువగా ఉండి, ఎక్కువ డిజైన్‌లు ఉండే నగలంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపింది. ప్రదర్శన ఈ నెల 19 నుండి 27 వరకు కొనసాగుతుందని షోరూం ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి తెలిపారు. చదవండి: నటనంటే నాకెంతో మజా: హిమజ
మయూరం.. చూడ చక్కని దృశ్యం
బంజారాహిల్స్: సందర్శకులను ఆకర్షించేందుకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌పార్కు ప్రధాన ద్వారంపై ఎదురెదురుగా రెండు నెమలి బొమ్మలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం పార్కు లోపల నుంచి ఓ నెమలి వచ్చి ఈ బొమ్మపై వాలి చూపరులను ఆకట్టుకుంది. వాకర్లు, సందర్శకులు ఈ సుందర, అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment