సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ | Bigg Boss 3 Telugu Secret Task Given To Himaja | Sakshi
Sakshi News home page

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

Published Fri, Aug 23 2019 10:58 PM | Last Updated on Fri, Aug 23 2019 11:01 PM

Bigg Boss 3 Telugu Secret Task Given To Himaja - Sakshi

బిగ్‌బాస్‌ ట్రిక్స్‌ను ప్రేక్షకులు ముందుగానే పసిగట్టేశారు. హిమజ గొడవ చేయడం.. కిచెన్‌లో ఎగ్స్‌ పగలగొట్టడంతో ప్రోమో విపరీతంగా వైరల్‌ అయింది. అయితే అది సీక్రెట్‌ టాస్క్‌ అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.  అందరూ  అనుకున్నట్లే అది సీక్రెట్‌ టాస్కే అని తేలిపోయింది. ఈ టాస్క్‌లో భాగంగా.. ఇంట్లోని కొన్ని వస్తువులను దొంగతనం చేయడం.. కిచెన్‌లో గొడవలు సృష్టించడం.. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ను పూర్తి కానివ్వకుండా అడ్డుకోవడం లాంటివి చేయాలని ఆదేశించాడు.
(బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?)

శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో వీడియోలు ప్లే చేయించి హౌస్‌మేట్స్‌ మధ్య చిచ్చు పెట్టాలని బిగ్‌బాస్‌ చూశాడు. దీనిలో భాగంగా తన గురించి వితికా, రాహుల్‌ మాట్లాడిన వీడియోలను పునర్నవికి ప్లే చేసి చూపించాడు. దీంతో పునర్నవి వితికా, రాహుల్‌పై అలిగింది. తన గురించి అలా మాట్లాడినందుకు పునర్నవి బాధపడుతూ ఉంటే.. అది సీక్రెట్‌ టాస్క్‌ అని వితికా అనుకుంటూ ఉంది. ఇక శ్రీముఖికి కూడా తన గురించి మాట్లాడిన వీడియోలను చూపించాడు. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లో వితికా, పునర్నవి, రాహుల్‌, వరుణ్‌ మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించగా.. వరుణ్‌ సందేశ్‌ కూడా అలా మాట్లాడటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

అలీరెజా గురించి మాట్లాడిన వీడియోలను కూడా చూపించాడు. హిమజ, శ్రీముఖి తన గురించి మాట్లాడిన వీడియోను, బాబా భాస్కర్‌ ఏడ్చిన వీడియోను ప్లే చేశాడు. దీంతో బయటకు వచ్చిన అలీ.. బాబాను క్షమించమని అడిగాడు. తనవల్ల బాబా మాష్టర్‌ ఏడ్చాడని అలీ తెగ బాధపడ్డాడు. వీరందరిని తమ గురించి వెనకాల మాట్లాడిన వీడియోలను ప్లే చేసి చూపించడానికి పిలవగా.. హిమజకు మాత్రం సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చేందుకు పిలిచాడు.

ఇంటి సభ్యుల వస్తువులను దొంగిలించడం.. అలీరెజాకు సంబంధించిన ప్రోటీన్‌ పౌడర్‌ను దాచిపెట్టడం.. హౌస్‌మేట్స్‌ బట్టలను స్విమ్మింగ్‌పూల్‌లో పడేయడం.. కిచెన్‌ హౌస్‌లో గొడవలు సృష్టించడం, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ను నాశనం చేయడం.. సీక్రెట్‌ టాస్క్‌ చేయాల్సిన పనులని హిమజను ఆదేశించాడు. అయితే అన్నీ కరెక్ట్‌గానే చేసుకుంటూ వచ్చిన హిమజ.. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌కు వచ్చేసరికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. హౌస్‌మేట్స్‌ అందరూ తన చర్యలను పసిగట్టి లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌కు దూరంగా ఉంచేలా చేశారు.

దీంతో హిమజ ఈ సీక్రెట్‌ టాస్క్‌లో విఫలమైనట్లు ప్రకటించాడు. ఇమ్యూనిటీ పవర్‌ను దక్కించుకోలేకపోయిందని బిగ్‌బాస్‌ తెలిపాడు. రాహుల్‌ బర్త్‌ డే సందర్భంగా బిగ్‌బాస్‌ కేక్‌ను పంపించాడు. హౌస్‌మేట్స్‌ అందరూ కలిసి రాహుల్‌ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేశారు. ఇక వీకెండ్‌ వచ్చేసింది. ఐదో వ్యక్తి ఇంటి నుంచి వెళ్లేందుకు సమయం వచ్చేసింది. మరి ఈ సారి రాహుల్‌ సిప్లిగంజ్‌, హిమజ, అషూ రెడ్డి, మహేష్‌ విట్టా, పునర్నవి భూపాలం, శివజ్యోతి, బాబా భాస్కర్‌లోంచి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో చూడాలి. 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement