హీరోయిన్‌కు చేదు అనుభవం..! | Shamita Shetty Was Verbally Abused In Road Accident | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 30 2019 8:02 PM | Last Updated on Wed, Jan 30 2019 8:12 PM

Shamita Shetty Was Verbally Abused In Road Accident - Sakshi

సాక్షి, క్రైమ్‌ : ప్రముఖ నటి షమితా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. షమితా వెళ్తున్న వాహనాన్ని బైక్‌పై వెళ్తున్న ఓ ముగ్గురు వ్యక్తులు డీకొట్టారు. అంతటితో ఆగకుండా.. షమితను దూషించారు. అడ్డుతగిలిన కారు డ్రైవర్‌ను కొట్టారు. దీంతో షమితా ఆ ముగ్గురిపై థానేలోని రబోడీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై కూడా దాడి చేశారని కారు డ్రైవర్‌ పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు.. ఆ బైక్‌ను కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఆ ముగ్గురిని పట్టుకుంటామన్నారు. ‘పిలిస్తే పలుకుతా’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షమితా.. ఆ చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. షమితా షెట్టి బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి సోదరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement