అలాంటి తప్పులు మళ్లీ చేయను: నటి | I realise how much I missed acting, says Shamita Shetty | Sakshi
Sakshi News home page

అలాంటి తప్పులు మళ్లీ చేయను: నటి

Published Wed, May 3 2017 9:04 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అలాంటి తప్పులు మళ్లీ చేయను: నటి - Sakshi

అలాంటి తప్పులు మళ్లీ చేయను: నటి

ముంబై: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీగా దూరమైన నటి షమితా శెట్టి తన మనసులో మాటను బయటపెట్టింది. సువర్ణ్ వర్మ డైరెక్షన్‌లో వెబ్ సిరీస్‌తో మళ్లీ మన ముందుకు రానున్నట్లు చెప్పింది. ఇండియా రన్ వే వీక్ 2017లో పాల్గొన్న సందర్భంగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. 'సినిమాలే జీవితంగా బతికిన ఆర్టిస్ట్.. ఒక్కసారిగా రంగుల ప్రపంచానికి దూరమైతే చాలా కోల్పోయినట్లు ఉంటుంది. అయితే ఈ విషయాన్ని చాలాకాలం తర్వాత గ్రహించాను. ఒక విషయం మీరు గమనించాలి. ఒకసారి యాక్టర్ అయితే ఎప్పుడైనా యాక్టర్‌గానే ఉంటారు.

గతంలో చేసిన తప్పుల్ని మళ్లీ చేసేందుకు సిద్ధంగా లేను. ప్రస్తుతం చేస్తున్న వెబ్ సిరీస్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను. అంతా సక్రమంగా జరిగితే నె రోజుల్లోనే మీరు వెబ్ సిరీస్‌లో నన్ను చూస్తారు. ఇంతకు మించి ఈ ప్రాజెక్టు గురించి ఏ వివరాలు వెల్లడించలేను' అంటోంది. డిజైనర్ రిటాంభారా పాలియా కలెక్షన్లను ర్యాంపుపై ప్రదర్శించి ఇటీవల ఓ ఈవెంట్లో విన్నర్‌గా నిలిచింది ఈ బ్యూటీ. ఇంటీరియర్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన షమితా.. మోడల్‌గా రాణించి ఆపై బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మేకప్ వేసుకోనున్నట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement