
తెలుగు ప్రేక్షకుల సాగరకన్య.. శిల్పాశెట్టి.. నటన కంటే ఆమె ఫిట్‌నెస్‌కే అభిమానులు ఎక్కువ. ఆ ఫిట్‌నెస్‌కు ఫిట్ అయ్యే ఫ్యాషన్ బ్రాండ్స్ కొన్ని ..
ప్రింట్స్ బై రాధిక...
అందమైన చిత్రకళ కొంతమందికి ఆనందాన్నిస్తే.. జైపూర్‌కు చెందిన రాధిక రావత్‌కు మాత్రం స్ఫూర్తిని ఇచ్చింది. ఆ ఆర్ట్‌ను ఆధారంగా చేసుకొని అందమైన దుస్తులను డిజైన్ చేయాలనుకుంది. ఆ ఆసక్తితోనే ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. లండన్ వెళ్లి స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చిత్రకళపై శిక్షణ తీసుకుంది. స్వదేశానికి తిరిగొచ్చి 2017లో సొంతంగా ‘ప్రింట్స్ బై రాధిక’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించింది. ఈ హౌస్‌లో లభించే దుస్తులన్నిటిపై ఉండే డిజైన్‌ను.. సొంతంగా రాధికే ముద్రిస్తుంది. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ప్రత్యేకమైన వేడుకలకు సరిపోయే డిజైన్స్‌ను రూపొందించడంలోనూ రాధిక సిద్ధహస్తురాలు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లలో ప్రింట్స్ బై రాధిక డిజైన్స్ లభిస్తాయి.
మొజాటీ జ్యూయెలరీ
సలోమీ షా బజాజ్.. శాస్త్రీయ నృత్యకళాకారిణి. వృత్తి రీత్యా సంప్రదాయ ఆభరణాల అవసరం తనకు చాలా ఎక్కువ. అయితే, తన నాట్యానికి సంబంధించిన ఆహార్యాన్ని తానే తయారుచేసుకోవాలనుకుంది. ఆ ఆలోచనే ఆమెను జ్యూయెలరీ డిజైనర్‌గా మార్చింది. తండ్రిది వజ్రాల వ్యాపారం కావడంతో తన పని మరింత సులువు అయింది. జెమాలజీ కోర్సు చేసి, ‘మొజాటీ’ పేరుతో జ్యూయెలరీ షాప్‌ను తెరిచింది. 18 క్యారెట్ల నాణ్యతతో అందమైన బంగారు ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. అయితే, ధర మాత్రం డిజైన్‌ను బట్టే ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా మొజాటీ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.
చీర బ్రాండ్: ప్రింట్స్ బై రాధిక
ధర:రూ. 30,000
జ్యూయెలరీ బ్రాండ్: మొజాటీ
ధర: రూ. 4,350
అందంగా కనిపించాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే, ఫ్యాషన్ కంటే ముందు నేను ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తా: శిల్పా శెట్టి