Shilpa Shetty Injures Herself While Shooting Of Indian Police Force Movie - Sakshi
Sakshi News home page

Shilpa Shetty: షూటింగ్‌లో కాలు విరగొట్టుకున్న హీరోయిన్‌.. ‘డైరెక్టర్‌ ఎలా చెప్పాడో అలాగే చేశా’

Published Wed, Aug 10 2022 6:25 PM | Last Updated on Wed, Aug 10 2022 6:58 PM

Shilpa Shetty Gets Injured While Shooting - Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి షూటింగ్‌లో గాయపడింది. ప్రస్తుతం తను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘వాళ్లు రోల్‌ కెమెరా.. యాక్షన్‌.. బ్రేక్‌ లెగ్‌ అన్నారు. అక్షరాల నేను అదే చేశాను. ఫలితంగా 6 వారాలపాటు షూటింగ్‌కు బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది.

చదవండి: విజయ్‌ అన్న చీజ్‌ కావాలంట? అంటూ కామెంట్స్‌, ‘రౌడీ’ రియాక్షన్‌ చూశారా?

కానీ, తొందర్లోనే మరింత శక్తితో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాను. అప్పటి వరకు నన్ను గుర్తుచేసుకోండి. ప్రార్థనలు ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. కృతజ్ఞతతో మీ శిల్పాశెట్టి కుంద్రా’ అంటూ రాసుకొచ్చింది. కాగా రోహిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ పోలీసు ఆఫీసర్‌’ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో సిద్ధార్థ్‌ మల్హోత్రా లీడ్‌రోల్‌ పోషిస్తుండగా.. శిల్పా పోలీసు ఆఫీసర్‌గా కనిపించింది. ఇందుకోసం ఇసుకలో పలు భారీ యాక్షన్‌ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో శిల్పా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అయతే గతంలో ఇదే షూటింగ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సైతం గాయపడిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement