నాజూగ్గా ఉండే శిల్పా శెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..! | Shilpa Shetty Is A Big Foodie That Proof Of Her Lunch Scene, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Shilpa Shetty Favourite Foods: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..!

Published Sun, Mar 24 2024 1:09 PM | Last Updated on Sun, Mar 24 2024 2:21 PM

Shilpa Shetty Is A Big Foodie That Proof Of Her Lunch Scene - Sakshi

బాలీవుడ్‌ భామ శిల్పా శెట్టి పేరుకి తగ్గట్టుగానే శిల్పంలా ఉంటుంది. ఐదు పదుల వయసుకు చేరవవ్వుతున్నా నేటీ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా కనిపిస్తోంది. శిల్పి చెక్కినట్లుగా ఉన్న శరీర సౌష్టవం, చెక్కు చెదరని అందం ఆమె సొంతం. మంచి యోగాసనాలతో ఇప్పటికీ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ కొత్త యోగాసనాలతో శరీరాన్ని ఎలా ఫిట్‌నెస్‌గా ఉంచొచ్చో చెబుతుంది. అలాంటి శిల్పా డైట్‌ పరంగా పెద్దగా ఏం తీసుకోదేమో అనుకుంటారు.

గానీ శిల్పా మంచి భోజనప్రియురాలు. తినాలనుకున్నవన్నీ శుభ్రంగా లాగించేస్తుందట. కాంప్రమైజ్‌ కాదట. ఆమె తింటున్న విధానం చూసి కచ్చితంగా శిల్పా శెట్టేనే ఇలా తినేదని షాకవ్వుతారు. అందుకు నిదర్శనమే ఆమె లంచ్‌ టైంలో తిన్న ఫుడ్‌ సీన్‌. చెప్పాలంటే ఓ సాధారణ మహిళ మల్లే భలే తింటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో శిల్పా..లంచ్ సిద్ధం అని చెప్పగానే శిల్పా.. నాకు బోండా, వడ ఉండాలి.. నా దగ్గర రవ్వ దోసె ఉండాలి. నాకు సాంబారు కావాలి. నా దగ్గర పెరుగు అన్నం ఉండాలి, కరకరలాడే ఇడ్లీ ఉండాలి, ఇంకా పనియారం కూడా ఉండాలంటూ త‌నకు ఇష్టమైన ఫుడ్స్‌ జాబితా మొత్తం చెబుతుంటం వీడియోలో కనిపిస్తుంది.

ఇక అక్క‌డితో ఆగ‌ని శిల్పా కుల్ఫీ  కూడా  కావాల‌ని చెబుతూ.. పాన్ గురించి గుర్తుచేస్తూ..అది బోజనం చివరన త‌ప్ప‌నిస‌రని చెబుతుండటం విశేషం. అయితే తనను ఎవ‌రో వీడియో తీస్తున్నారని తెలిసి బిగ్గ‌ర‌గా న‌వ్వుతుంది. ఇక శిల్పా ప‌క్క‌నే నిలుచున్న యువ‌తి ఓ లంచ్ అయిన త‌ర్వాత ఇది..ఇప్ప‌టికే ఒక‌సారి లంచ్‌, రెండుసార్లు బ్రేక్‌ఫాస్ట్ అయింద‌ని చెప్పడం గమనార్హం. ఇక ఆ త‌ర్వాత వీడియోలో శిల్ప ముందు ఆమె ఆర్డ‌ర్ చేసిన డిష్‌లు కొద్దిగా తినిఉండ‌టం క‌నిపిస్తుంది. ఇక చివ‌రిగా వీడియోలో కుల్ఫీని ఎంజాయ్ చేయడమే గాక పాన్‌ని కూడా ఆస్వాదించడం కనిపిస్తుంది.  

(చదవండి: డౌన్‌ సిండ్రోమ్‌తో డౌన్‌ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement