‘‘గన్నూ రాజాకు బై..బై..!’’ ముద్దుల తనయతో శిల్పాశెట్టి డ్యాన్స్‌ అదుర్స్‌ | Vinayaka Chavithi2024: Shilpa Shetty and her daughter Dance During Visarjan video goes viral | Sakshi
Sakshi News home page

‘‘గన్నూ రాజాకు బై..బై..!’’ ముద్దుల తనయతో శిల్పాశెట్టి డ్యాన్స్‌ అదుర్స్‌

Published Mon, Sep 9 2024 3:03 PM | Last Updated on Mon, Sep 9 2024 4:57 PM

Vinayaka Chavithi2024:  Shilpa Shetty and her daughter Dance During Visarjan video goes viral

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి  ప్రతీ ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.  అయితే ఈ సారి తన ముద్దుల తనయతో కలిసి  చేసిన నృత్యం హృద్యంగా  నిలిచింది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి విసర్జన ఆచారాలను నిర్వహించి, ధోల్ దరువులకు ఆనందంగా నృత్యం చేశారు.దీనికి  సంబంధించిన వీడియో గణపతి భక్తులను బాగా  ఆకట్టుకుంటోంది.  ముఖ్యంగా కుమార్తె సమీషాతో కలిసి విసర్జన్ పూజ కోసం ట్విన్నింగ్‌  లెహంగా-చోలీలో   ఉత్సాహంతా  డ్యాన్స్‌  చేసి అలరించారు.

అంతకుముందు గణపతి బప్పాకు ఇంటికి సాదరంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు శిల్పాశెట్టి దంపతులు. ఆ తరువాత అందమైన సాంప్రదాయ దుస్తుల్లో గణపతికి వీడ్కోలు పలికారు.  భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషా, సోదరి షమితా శెట్టి, తల్లి సునందతో కలిసి ఇష్టదైవం హారతి ఇచ్చి, గణపతిబప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య  వీడ్కోలు పలికారు.

 "మా గన్ను రాజాకు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు,  అత్యంతభక్తి, ప్రేమతో నిండి ఉన్నాం. కానీ భారమైన హృదయాలతో వీడ్కోలుపలుకుతున్నాం, వచ్చే ఏడాది మిమ్మల్ని స్వాగతించేందుకు  ఎదురు చూస్తూ..’’ అంటూ శిల్పా ఒక వీడియోను  ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. 
 

భర్త జాకీ భగ్నానీతో  కలిసి పాల్గొన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
శిల్పాశెట్టి ఘనంగా నిర్వహించిన గణపతి వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.  ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్,ఆమె భర్త జాకీ భగ్నానీ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement