పెళ్లైపోతుందనంగా... వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్‌ చేస్తూ... | Uttarakhand Brides Father Dancing At Mehendi Suddenly Fell On Floor | Sakshi
Sakshi News home page

పెళ్లైపోతుందనంగా... వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్‌ చేస్తూ...

Published Tue, Dec 13 2022 11:21 AM | Last Updated on Tue, Dec 13 2022 11:35 AM

Uttarakhand Brides Father Dancing At Mehendi Suddenly Fell On Floor - Sakshi

కూతురు పెళ్లైపోతుందనంగా ఓ తండ్రి గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...కూతురు పెళ్లైపోతుందని చాలా ఆనందోత్సాహాతో ఉన్నాడు తండ్రి. ఆ క్రమంలో ఆయన కూతురు మెహందీ ఫంక్షన్‌ ఆనందంగా తండ్రి డ్యాన్స్‌ చేశాడు. అంతే ఉన్నటుండి ఒక్కసారిగి కుప్పకూలి కింద పడిపోయాడు ఆ తండ్రి.

దీంతో బంధువులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అతను గుండె పోటుతో అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. ఈ ఘటనతో పెళ్లింట ఒక్కసారిగా విషాధ చాయాలు కమ్ముకున్నాయి. వివాహ వేడుక జరగాల్సిన హల్ద్వానీకి చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోంది. దీంతో కుటుంబసభ్యులు ఎలాంటి హడావిడి లేకుండా సాధాసీదాగా సదరు యువతి వివాహాన్ని జరిపించారు. వధువు కన్యా దానాన్ని ఆమె మేనమామ చేశారు. 

(చదవండి: పండ్లరసంలో మద్యం కలిపి తాగించి.వృద్ధుడు అఘాయిత్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement