
Shilpa Shetty Goes Off Social Media: బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. తాజాగా ఆమె సోషల్ మీడియాకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది. కొంతకాలం వరకు తను సామాజిక మాధ్యమాల్లో కనిపించనని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ మేరకు శిల్పా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తి బ్లాక్ ఫొటోను షేర్ చేసింది. ‘ఎలాంటి కొత్తదనం లేదు. అంతా ఒకేలా కనిపిస్తోంది. చాలా బోర్ కొట్టేసింది. ఏదైనా కొత్తదనం కనిపించేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను’ అని శిల్పాశెట్టి రాసుకొచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు. కాగా శిల్పా తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు తన పిల్లల వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అంతేకాదు ఆమె ఫిట్‌నెస్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది: అల్లు అరవింద్
యోగా, వ్యాయమం చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కు సూచనలు ఇచ్చేది. ఇంతలో ఆమె సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని చెప్పడంతో శిల్పా ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. కాగా శిల్పాశెట్టి సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై సందడి చేస్తోంది. దీనితో పాటు ఆమె త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌తో కలిసి ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తోంది శిల్పా. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్ ద్వారా శిల్పా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
చదవండి: ఆడియన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment