అన్నవరం దేవస్థానం...సక్రమ నిర్వహణకు పాలకవర్గం ... అధికార గణం ... వీరు తీసుకున్న నిర్ణయాలపైనా ఆలయ ఆదాయం ... ప్రగతి ఆధారపడి ఉంటాయి. కానీ ఆ నిర్ణయాలే శాపాలుగా మారి అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి. భక్తులపై భారం మోపుతు న్నాయి. సౌకర్యాలు కల్పించాలి్సందిపోయి సమస్యలు సృష్టిస్తున్నాయి. సమన్వయం కొరవడడంతో విభేదాలు బుసకొడుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు అందినకాడికి దోచుకుంటున్నారు.
-
వరుస వైఫల్యాలతో విమర్శలు
-
చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి దూరంగా...
-
అసలు వాటిపై దృష్టి పెట్టకుండా కాలక్షేపం
-
అక్రమాలను అరికట్టడంలోనూ ప్రేక్షకపాత్రే
-
సమన్వయ లోపంతో భక్తులకు ఇబ్బందులు
అన్నవరం :
ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన అన్నవరంలోని శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో చోటుచేసుకున్న అక్రమాలు ... తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో ఆలయ ప్రతిష్ఠ మసకబారుతోంది. దేవాదాయ శాఖ అధికారులు ఈఓలుగా ఉంటే అవినీతి అధికమవుతుందని భావించిన ప్రభుత్వం రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్ గ్రేడ్ డిఫ్యూటీ కలెక్టర్ కె.నాగేశ్వరరావును ఇక్కడ ఈఓగా రెండేళ్ల కిందట నియమించింది. దేవస్థానం నిర్వహణపై పెద్దగా అవగాహన లేకపోవడం, ఎవరి సలహా కూడా పాటించకపోవడం, తనే ‘సుప్రీం’ అనే రీతిలో పరిపాలన కొనసాగించడంతో దేవస్థానంలో అనేక అవకతవకలకు ఆస్కారం ఏర్పడిందన్న విమర్శలున్నాయి. ఏకపక్ష నిర్ణయాలతో సిబ్బందిలో కూడా సమన్వయం కొరవడింది. l
చక్కదిద్దాల్సిందిపోయి అనవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించడంతో వివాదాలు తలెత్తాయి. ప్రధానంగా దేవస్థానంలో పనిచేసే వ్రత పురోహితులకు పిలకలున్నాయా? ఉంటే అవి ఎంత పొడుగు ఉన్నాయంటూ ఆరా తీయడంతో సంబంధిత పురోహితులు అవమానంగా భావించారు. ఆ విషయం పరిశీలించడానికి సంబంధిత విభాగ అధికారులుంటుండగా నేరుగా ఈయన ప్రశ్నించడం... ఫొటోలు తీయించడమేమిటని గొంతు పెంచడంతో దూరం పెరిగింది.
వ్రత పురోహితుల పిలకపై పితలాటకం...
దేవస్థానంలో కీలకమైన విభాగాలను ప్రతి రోజూ పర్యవేక్షించి అక్కడ వ్యవహారాలను l
చక్కదిద్దాల్సిందిపోయి అనవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించడంతో వివాదాలు తలెత్తాయి. ప్రధానంగా దేవస్థానంలో పనిచేసే వ్రత పురోహితులకు పిలకలున్నాయా? ఉంటే అవి ఎంత పొడుగు ఉన్నాయంటూ ఆరా తీయడంతో సంబంధిత పురోహితులు అవమానంగా భావించారు. ఆ విషయం పరిశీలించడానికి సంబంధిత విభాగ అధికారులుంటుండగా నేరుగా ఈయన ప్రశ్నించడం... ఫొటోలు తీయించడమేమిటని గొంతు పెంచడంతో దూరం పెరిగింది.
అక్రమాలపై ఏదీ దృష్టి...
వ్రత పురోహితులపై చూపిన శ్రద్ధలో పదో వంతు కేశ ఖండనశాలపై చూపించి ఉంటే అక్కడ రూ.ఏడు లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యేవి కాదు. కేశ ఖండన టిక్కెట్ల స్కాం జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి దేవస్థానంలోని ఏ పాటదారుడైనా పాట సొమ్ము కనీసం సగమైనా చెల్లిస్తే తప్ప వ్యాపారం నిర్వహణకు అనుమతించరు. అటువంటిది మూడు నెలల సొమ్ము కూడా పూర్తిగా చెల్లించని పాటదారుడిని ఎలా అనుమతించారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. నిబంధనలు ఉల్లంఘించి పాటదారునికి సహకారం అందించడం వల్లనే అలుసుగా తీసుకుని తలనీలాలు మాయం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏడాది నుంచి అక్రమాలు సాగుతున్నా...
కేశఖండనశాలలో ఏడాది నుంచి టిక్కెట్ల స్కాం, ఆరు నెలల క్రితం నంచీ తలనీలాలు మాయమవుతున్నా పసిగట్టలేని దుస్థితి. ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయంటే అది అధికారుల నిర్లక్ష్యమేనని పలువురు ధ్వజమెత్తుతున్నారు. సత్రాల్లో గదులు ఖాళీ అయ్యాక రశీదులు ఇవ్వకుండానే కొంతమంది సిబ్బంది గదులు కేటాయిస్తున్నారనే ప్రచారం ఉంది. దీనిపై ఈఓ ఏనాడూ సత్రాల విభాగంపై దృష్టి కేంద్రీకరించిన దాఖలాలు లేవు. కేశఖండన స్కాం బయట పడ్డాక మాత్రమే విష్ణుసద¯ŒSను పరిశీలించి అవకతవకలకు పాల్పడిన కాంట్రాక్ట్ ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించారు.
సామాన్య భక్తులకు నరకమే...
సామాన్య భక్తులు ఎక్కువగా రూ.200 వ్రతాలనే చేయిస్తుంటారు. ఈ వ్రతాలు జరిగే వ్రత మండపాలు మూడే ఉన్నాయి. ఈ మండపాల్లో వ్రతాలు ఆచరించాలంటే సుమారు రెండు గంటలు క్యూలో నిల్చోవాలి. ఆ క్యూ లైన్ల మీద ఎటువంటి పందిరి కాని, షెల్టర్ కాని ఉండదు. పశ్చిమ రాజగోపురం వద్ద గల వ్రతాల కౌంటర్‌లో ఈ టిక్కెట్లు అమ్మరు. ఆ భక్తులు మెయి¯ŒS కౌంటర్ వద్దకు వెళ్లాల్సిందే. భక్తులు ఎక్కువ ఉన్నా అక్కడ కూడా ఈ వ్రతాలకు టిక్కెట్లు ఇవ్వరు. ఇదేమి అన్యాయమని భక్తులు ప్రశ్నిస్తే రూ.400 వ్రతం టిక్కెట్టు తీసుకోండని సిబ్బంది చెబుతుంటారు. ఎందుకిలా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆలయ ఆదాయం పెంచడానికేనన్న సమాధానం వచ్చేది. దీంతో భక్తులు అటు రూ. 200 టిక్కెట్ దొరక్క ... అటు రూ.400 ఇచ్చి వ్రతం చేసుకోలేక ఇబ్బందులు పడేవారు.
కుంటి నడకన ఆదాయం
2016–17లో సత్యదేవుని ఆదాయం రూ.122.59 కోట్లు. గత ఏడాది అంటే 2015–16లో వచ్చిన రూ.118.95 కోట్లతో పోల్చితే ఆదాయం పెరుగుదల కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే. 2013–14లో రూ.72.05 కోట్లు, 2014–15లో రూ.92.93 కోట్లు వచ్చింది. అంటే వరుసగా గత మూడేళ్లలో పెరిగిన ఆదాయం రూ.20 కోట్లు, రూ.25 కోట్లు, రూ.3.5 కోట్లు మాత్రమే.
ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు...
దేవస్థానంలో గత రెండేళ్లలో ఈఓ తీసుకున్న నిర్ణయాల్లో మెజార్టీ వివాదాస్పదంగా మారాయి. ఉదాహరణకు రామాలయం ఆర్చీలకు నల్లరంగు పులిమారు. అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో మళ్లీ తెలపు రంగు వేశారు. అన్ని దేవాలయాల్లో తెల్ల అద్దాలతో పవళింపు మందిరాలు నిర్మిస్తే ఇక్క నల్ల అద్దాలతో నిర్మించారు.
ఇక సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో ప్రతిసారీ పొరపాట్లు దొర్లడం కూడా ఇబ్బందికరంగానే తయారైంది. ఇక భక్తులు కొండవీుదకు వచ్చేందుకు తగినన్ని బస్సులు నడపకపోవడం, ఆటోలను అనుమతించకపోవడం లాంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితి.
ఈఓను సాగనంపే యత్నాలు...
సత్యదేవుని కల్యాణ ఉత్సవాల వైఫల్యం, దేవస్థానంలో వెలుగు చూస్తున్న అవకతవకలతో దేవస్థానం ఈఓ నాగేశ్వరరావును ఇక్కడ నుంచి సాగనంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కొంతమంది అధికార పార్టీ నాయకులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ కల్లా కొత్త ఈఓ వస్తారనే ప్రచారం ఊపందుకుంది.