- సరిచేసుకునేందుకు అభ్యర్థుల తిప్పలు
- ఆందోళన వద్దంటున్న అధికారులు
‘పోలీసు’ పరీక్షా ఫలితాల్లో తప్పులు
Published Fri, Feb 10 2017 12:49 AM | Last Updated on Tue, Aug 21 2018 9:06 PM
కాకినాడ క్రైం :
సివిల్, ఏఆర్ కానిస్టేబుల్, జైల్ వార్డర్ పోస్టులకు పోలీస్‌శాఖ నియామక మండలి ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీన నిర్వహించిన ఫైనల్ రాత పరీక్షలో ఉత్తీర్ణుల వివరాల్లో అచ్చుతప్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నెల ఆరో తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో అభ్యర్థుల వివరాలు, కులం, మార్కుల వివరాల్లో ఏమైనా తేడాలుంటే వాటిని సరిచేసుకునేందుకు ఈనెల 7 నుంచి 13వ తేదీ దాకా అవకాశం కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. జాబితాలను డౌ¯ŒSలోడ్ చేసుకున్న దరఖాస్తుల్లో అధిక సంఖ్యలో అచ్చుతప్పులు ఉండటం చూసి అభ్యర్థులు కంగు తిన్నారు. అభ్యర్థి పేరు దగ్గర పాఠశాలలో చదివిన సంవత్సరం, పదో తరగతి పాసైన సంవత్సరం, పాఠశాల పేరు, అభ్యర్థుల ఇంటి పేర్ల దాకా అన్నింటా అచ్చుతప్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సరిచేసుకునేందుకు మూడు రోజులుగా అధిక సంఖ్యలో అభ్యర్థులు కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకున్న దగ్గర నుంచి ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలు దాకా రెండు సార్లు తమ ఒరిజినల్ సరిఫికెట్లతో సమాచారాన్ని ఇచ్చామని, అయినా సరే దరఖాస్తులో తప్పులు దొర్లడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని కోరారు. ఈ విషయమై అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను వివరణ కోరగా ప్రిలిమినరీ, దేహదారుఢ్య, ఫైనల్ పరీక్షలో వచ్చిన మార్కుల్లో ఏమైనా తేడాలుంటే వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. అభ్యర్థుల పేర్లలో అక్షర దోషాలు, దరఖాస్తుల్లో వచ్చిన తప్పులను సరిచేసేందుకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఎటువంటి ఆందోళనకు గురికానవసరం లేదని తెలిపారు.
Advertisement
Advertisement