కుమారుడి తప్పు..తండ్రికి శిక్ష | Sons wrong thing is punishment to Father | Sakshi
Sakshi News home page

కుమారుడి తప్పు..తండ్రికి శిక్ష

Published Thu, Apr 5 2018 2:28 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Sons wrong thing is punishment to Father - Sakshi

సంజీవ రావుని చెట్టుకు కట్టేసిన దృశ్యం

పశ్చిమ గోదావరి జిల్లా : అక్కడ ఒకటే చట్టం..తప్పు చేసిన వారిని ఊరి మధ్యలో చెట్టుకు కట్టేసి జరిమానా విధించడం..కాదంటే కొరడా దెబ్బలు. ఇది ఆ ఊరి కట్టుబాటు..ఎన్ని చట్టాలు, పోలీసులు ఉన్నా..భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ నడుస్తూనే ఉంది దానికి నిదర్శనమే నేటి టి.నర్సాపురం మండలం సాయంపాలెం సంఘటన. వివరాలు..సాయంపాలెం గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన చింతపల్లి ప్రసాద్‌ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఆమె తన భర్తకు చెప్పడంతో ఆయన పంచాయితీ పెట్టించాడు.

ఈ ఘటన జరిగిన వెంటనే నాగేంద్ర పరారయ్యాడు. నాగేంద్ర తండ్రి సంజీవరావుని కుమారుడిని అప్పగించాలని రెండు రోజుల క్రితం గ్రామపెద్దలు ఆదేశించారు. కుమారుడు పరారీలో ఉన్నాడని, ఆచూకీ తెలియదని చెప్పడంతో ఆయన చెట్టుకు కట్టేసి పంచాయితీ చేశారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement