1/12
ప్రభాస్ రాఘవుడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఇప్పటివరకు మనకు రాముడు అంటే నీలమేఘ శ్యాముడిగానే తెలుసు. కానీ 'ఆదిపురుష్'లో రాముడికి మీసాలు పెట్టడం, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడం.. రామ భక్తులకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.
2/12
సీత పాత్రలో కృతి సనన్ పలు రకాల రంగుల దుస్తులు ధరించింది. కానీ ఇతిహాసమైన రామాయణంలో అజ్ఞాతవాసంలో ఉన్న సీత కేవలం కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించింది.
3/12
రావణుడికి ఉన్న పది తలలపై ప్రేక్షకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. అంతే కాకుండా రావణుడి కేశాలంకరణ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలి ఉందని కామెంట్స్ చేశారు.
4/12
సీతను రావణుడు ఎత్తుకెళ్లిపోతే జఠాయు పక్షి రాముడికి ఈ విషయం చెబుతుంది. 'ఆదిపురుష్'లో మాత్రం రాముడు, లక్ష‍్మణుడు స్వయంగా చూస్తారు.
5/12
చివర్లో బాణంతో రావణాసురుడిని చంపే రాముడు.. సీతను ఎత్తుకెళ్తుంటే ఏం చేయలేకపోతాడు.
6/12
ప్రశాంత చిత్తమైన రాముడిని.. బలపరాక్రమశాలిగా చూపించడం కూడా కాస్త వింతగా అనిపించింది.
7/12
హాలీవుడ్ మూవీల్లో కార్టూన్స్ లాంటివి 'ఆదిపురుష్'లో చాలా చోట్ల కనిపిస్తాయి. పిల్లలకు అవి నచ్చొచ్చేమో గానీ పెద్దోళ్లకు రామాయణం గురించి తెలిసిన వాళ్లకు మాత్రం షాకింగ్ గా అనిపిస్తుంది.
8/12
సినిమాలో హనుమంతునిపై రాసిన డైలాగులు ప్రేక్షకులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే డైలాగ్స్‌ను తర్వాత నిర్మాతలు మార్చేశారు.
9/12
పురాణాల ప్రకారం రావణుడి లంక బంగారు వర్ణంతో నిండి ఉంది. అయితే ఓం రౌత్ లంకను ఈ చిత్రంలో నలుపు, తెలుపులో చిత్రీకరించినందుకు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు.
10/12
పుష్పక విమానంలో రావణుడు సీతను అపహరిస్తాడు. కానీ.. ఆదిపురుష్‌లో మాత్రం నల్లటి గబ్బిలం లాంటి పక్షిపై రావణుడు కనిపించాడు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.
11/12
ఇంద్రజిత్ పాత్రలో మేఘనాథ్‌కు చాలా టాటూలు వేయించుకున్నట్లు చూపించారు. దీంతో నెటిజన్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు.
12/12
ఇందులో రావణుడు కొండచిలువలతో మసాజ్ చేయించుకున్నట్లు చూపించారు.