ప్రతీకాత్మక చిత్రం
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్) : విద్యాశాఖ లో ఓ జిల్లాస్థాయి అధికారి భార్య ఘన్‌పూర్ పాఠశాలలో తొమ్మిదేళ్లుగా ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల రెండేళ్ల క్రితం వరకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ పరిధిలో ఉండేది. తర్వాత జరిగిన హెచ్‌ఆర్‌ఏల మార్పిడిలో మూడో కేటగిరిలోకి పాఠశాల చేరింది. ఆమెకు ఏడేళ్లు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ పాయింట్లు, రెండేళ్లు 12.5 శాతం హెచ్‌ఆర్‌ఏలో స్కూల్ కేటగిరి పాయింట్లు కేటాయించాలి. కానీ 9 ఏళ్లు 12.5 శాతం హెచ్‌ఆర్‌ఏ కేటగిరిలో ఉన్నట్లే చూపించి 27 పాయింట్లు వేశారు. దీంతో సీనియారిటీ జాబితాలో ఆమె వేలమంది టీచర్ల కంటే ముందు వరుసలో చేరిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న బదిలీ ప్రక్రియ రచ్చకెక్కుతోంది. ప్రక్రియలో మొదటి నుంచీ చోటుచేసుకుంటున్న అవకతవకలు ఆ శాఖకే మచ్చతెస్తున్నాయి.
శనివారం వెబ్‌సైట్‌లో ఉంచిన సీనియారిటీ జాబితానే అందుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్కూల్ కేటగిరి పాయిం ట్లు, ఎస్సెస్సీ కేటగిరి పాయింట్లలో జరిగిన లోపాలు విద్యాశాఖ అధికారులకు తెలియవా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. బదిలీల్లోభాగంగా మొన్న ప్రిఫరెన్సియల్ కేటగిరి అవకతవకలు జరగగా, నేడు సీనియారిటీ జాబితాలో అవే తప్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా కిందిస్థా యి ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా మొదటగా ప్రిఫరెన్సియల్ కేటగిరి వారి కి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వా త సర్వీస్, స్కూల్ కేటగిరి, ఎస్సెస్సీ, స్పౌజ్ కేటగిరి, సంఘం నాయకులు, ఇత రాత్ర కేటగిరీలకు పాయింట్లు కేటాయించారు. స్కూల్ కేటగిరి, ఎస్సెస్సీ, స్పౌజ్ కేటగిరీల్లో అక్కడక్క డా అవకతవకలు చోటు చేసు కున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ కేటగిరి పాయింట్లలో నాలుగు
రకాలుగా పాయింట్లను కేటాయి
స్తారు. అందులో 20 శాతం హెచ్‌ఆర్‌ఏలో పని చేసిన, చేస్తున్న వారు తక్కువ కేటగిరీలో పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు. తద్వారా వారికి పాయింట్లు పెరిగే ఆస్కారం ఉంది. హెచ్‌ఆర్‌ఏల మార్పిడిలో సక్రమంగా పరిశీలన జరగలేదు. ఎస్సెస్సీ కేటగిరీలో పాయింట్లు ఇష్టానుసారంగా వేసుకున్నట్లు వెలుగులోకి వచ్చాయి. జిల్లా విద్యాశాఖ వద్ద పదోతరగతి రిజల్ట్స్ పూర్తిస్థాయిలో ఉంటాయి. అయినప్ప టికీ టీచర్లు ఇష్టానుసారంగా వేసుకున్న పాయింట్ల ఆధారంగానే సీనియారిటీ గుర్తించడం జరిగింది. అంటే జిల్లా కమిటీ ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.స్పౌజ్ కేటగిరిలోనూ అవకతవకలు చోటుచేసుకున్నా యి. భార్యభర్తల్లో ఒకరికి 8 ఏళ్లల్లో ఒకరికి మాత్రమే 10 పాయింట్లు కేటాయిస్తారు.
ఇద్ద రూ ఒకే శాఖలో పని చేస్తే తప్పు జరిగేందుకు ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ ఇద్దరు వేర్వే రు శాఖల్లో పనిచేసే వారైతే పాయింట్ల కోసం గతంలో స్పౌజ్ కేటగిరీని వినియోగించుకోలేదనే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ గుర్తిం పు పొందిన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 పాయింట్ల చొప్పున కేటాయిస్తున్నారు. ఇటీవలే కొన్ని సం ఘాలకు ప్రభుత్వం గుర్తింపు నిచ్చింది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే సంఘం బాధ్యులు మారిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, రెండు సంఘాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుం డా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పేర్లు జిల్లాపరిషత్ (లోకల్‌బాడీస్) జా బితాలో, జిల్లాపరిషత్ ఉపాధ్యాయుల పేర్లు ప్రభుత్వ పాఠశాలల జాబితాలో వచ్చా యి.
డీఈఓపై కలెక్టర్ ఆగ్రహం..?
ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలపై జిల్లా కలెక్టర్ డీఈఓపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలి సింది. మొన్న మెడికల్ సర్టిఫికెట్లలో ఎలా లోపాలు జరిగాయని ప్రశ్నించినట్లు సమాచా రం. బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రిఫరెన్సియల్ కేటగిరి, సీనియారిటీ జాబితాలను హెచ్‌ఎంలు, ఎంఈఓల స్థాయిలో మండల కమిటీ, డీఈఓ స్థాయి లో జిల్లా కమిటీలు పరిశీలించిన తర్వాత కూడా ఎలా లోపాలు జరుగుతున్నాయన్నది ఎవరికీ అం దని ప్రశ్న. అన్నీ తప్పులు తెలిసే జరుగుతున్నాయని టీచర్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మెడికల్ సర్టిఫికెట్లలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి.
19న ఫైనల్ జాబితా ఉంచుతాం
సీనియారిటీ జాబితాలో ఒకటి,అర లోపాలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. 16, 17 తేదీల్లో లోపాలకు సంబంధించిన అప్పీళ్లను స్వీకరిస్తాం.ఇప్పటికే ఎంఈఓలు ఆయా ఎమ్మార్సీల్లో అందుబాటులో ఉంటున్నారు. ఉపాధ్యాయులే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో చేసిన పొరపాట్ల వల్లే లోపాలు జరిగాయి. వాటి కోసమే రెండ్రోజు లు సమయమిచ్చాం. ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. 19న ఫైనల్ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతాం.
- నాంపల్లి రాజేష్, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment