Teachers transfer process
-
సంఘాల అంగీకారం తర్వాతే వెబ్‌కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సమ్మతి తీసుకున్న తర్వాతే చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన టీచర్ల బదిలీల అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికీ అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ చేపట్టిందన్నా రు. ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అంగీకరించిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని కొద్దిరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పదో న్నతులు ఇవ్వడం లేదని చెప్పారు. మేనేజ్‌మెంట్లవారీగా బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేద్దామని చెబితే ఉపాధ్యాయ జేఏసీలు అంగీకరించిన తర్వాతే జూన్ 6న జీవో 16ను తీసుకొచ్చామన్నారు. సీనియార్టీ విషయంలో కొంతమంది తప్పుడు పత్రాలు పెట్టా రని తెలిసిన వెంటనే వాటిని సరిదిద్ది తుది జాబితా వెల్లడించామన్నారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ వద్దని కొన్ని సంఘాలు అంటుండటం సరికాదన్నారు. కొందరు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని, ఇతర కారణాలతోనూ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టులో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 26కి రిజర్వ్ చేశారని, ఈలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేశామని, వెబ్ కౌన్సెలింగ్‌లో బదిలీల నిర్వహణను ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షించిందన్నారు. వెబ్ కౌన్సె లింగ్ వద్దంటూ తన వ్యక్తిగత ఫోన్‌కు వేల మెస్సేజ్ లు, వందల కాల్స్ చేయిస్తున్నారని, ఈ ఎస్సెమ్మెస్ లు ఎక్కడి నుంచి పెట్టిస్తున్నారో విచారణ చేయించి, తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ౖపై కొంతమంది యూనియన్ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పొరపాట్లు సరిదిద్దారు.. టీచర్ల బదిలీ షెడ్యూల్లో మార్పులు చేసిన విద్యాశాఖ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఆప్షన్ తేదీల గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో పొరపాట్లను సరిదిద్దే చర్యలను విద్యాశాఖ వేగిరం చేసింది. ఇందులో భాగంగా కీలక దశలో ఉన్న వెబ్‌కౌన్సెలింగ్ గడువును పొడిగించి ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం ఇచ్చింది. ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం) వెబ్‌కౌన్సెలింగ్ ముగిసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్‌కౌన్సెలింగ్ గడువును ఒకరోజు పెంచింది. ఈ నెల 26 వరకు స్కూల్ అసిస్టెంట్లు వెబ్ఆప్షన్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు) వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ మొరాయిస్తుండటంపై విద్యాశాఖకు ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలను అధిగమించే క్రమంలో ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్సైట్ మొరాయించడమే కీలక సమస్యగా మారింది. దీంతో ఓటీపీ రావడం, ఆప్షన్ల నమోదు ప్రక్రియ గంటల తరబడి జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సర్వర్ల ఏర్పాటుతో టీచర్లకు ఊరట లభించినట్లైంది. -
తెలిసే తప్పులు
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్) : విద్యాశాఖ లో ఓ జిల్లాస్థాయి అధికారి భార్య ఘన్పూర్ పాఠశాలలో తొమ్మిదేళ్లుగా ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల రెండేళ్ల క్రితం వరకు 20 శాతం హెచ్ఆర్ఏ పరిధిలో ఉండేది. తర్వాత జరిగిన హెచ్ఆర్ఏల మార్పిడిలో మూడో కేటగిరిలోకి పాఠశాల చేరింది. ఆమెకు ఏడేళ్లు 20 శాతం హెచ్ఆర్ఏ పాయింట్లు, రెండేళ్లు 12.5 శాతం హెచ్ఆర్ఏలో స్కూల్ కేటగిరి పాయింట్లు కేటాయించాలి. కానీ 9 ఏళ్లు 12.5 శాతం హెచ్ఆర్ఏ కేటగిరిలో ఉన్నట్లే చూపించి 27 పాయింట్లు వేశారు. దీంతో సీనియారిటీ జాబితాలో ఆమె వేలమంది టీచర్ల కంటే ముందు వరుసలో చేరిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న బదిలీ ప్రక్రియ రచ్చకెక్కుతోంది. ప్రక్రియలో మొదటి నుంచీ చోటుచేసుకుంటున్న అవకతవకలు ఆ శాఖకే మచ్చతెస్తున్నాయి. శనివారం వెబ్సైట్లో ఉంచిన సీనియారిటీ జాబితానే అందుకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్కూల్ కేటగిరి పాయిం ట్లు, ఎస్సెస్సీ కేటగిరి పాయింట్లలో జరిగిన లోపాలు విద్యాశాఖ అధికారులకు తెలియవా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి. బదిలీల్లోభాగంగా మొన్న ప్రిఫరెన్సియల్ కేటగిరి అవకతవకలు జరగగా, నేడు సీనియారిటీ జాబితాలో అవే తప్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా కిందిస్థా యి ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా మొదటగా ప్రిఫరెన్సియల్ కేటగిరి వారి కి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వా త సర్వీస్, స్కూల్ కేటగిరి, ఎస్సెస్సీ, స్పౌజ్ కేటగిరి, సంఘం నాయకులు, ఇత రాత్ర కేటగిరీలకు పాయింట్లు కేటాయించారు. స్కూల్ కేటగిరి, ఎస్సెస్సీ, స్పౌజ్ కేటగిరీల్లో అక్కడక్క డా అవకతవకలు చోటు చేసు కున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ కేటగిరి పాయింట్లలో నాలుగు రకాలుగా పాయింట్లను కేటాయి స్తారు. అందులో 20 శాతం హెచ్ఆర్ఏలో పని చేసిన, చేస్తున్న వారు తక్కువ కేటగిరీలో పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు. తద్వారా వారికి పాయింట్లు పెరిగే ఆస్కారం ఉంది. హెచ్ఆర్ఏల మార్పిడిలో సక్రమంగా పరిశీలన జరగలేదు. ఎస్సెస్సీ కేటగిరీలో పాయింట్లు ఇష్టానుసారంగా వేసుకున్నట్లు వెలుగులోకి వచ్చాయి. జిల్లా విద్యాశాఖ వద్ద పదోతరగతి రిజల్ట్స్ పూర్తిస్థాయిలో ఉంటాయి. అయినప్ప టికీ టీచర్లు ఇష్టానుసారంగా వేసుకున్న పాయింట్ల ఆధారంగానే సీనియారిటీ గుర్తించడం జరిగింది. అంటే జిల్లా కమిటీ ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.స్పౌజ్ కేటగిరిలోనూ అవకతవకలు చోటుచేసుకున్నా యి. భార్యభర్తల్లో ఒకరికి 8 ఏళ్లల్లో ఒకరికి మాత్రమే 10 పాయింట్లు కేటాయిస్తారు. ఇద్ద రూ ఒకే శాఖలో పని చేస్తే తప్పు జరిగేందుకు ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ ఇద్దరు వేర్వే రు శాఖల్లో పనిచేసే వారైతే పాయింట్ల కోసం గతంలో స్పౌజ్ కేటగిరీని వినియోగించుకోలేదనే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ గుర్తిం పు పొందిన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 10 పాయింట్ల చొప్పున కేటాయిస్తున్నారు. ఇటీవలే కొన్ని సం ఘాలకు ప్రభుత్వం గుర్తింపు నిచ్చింది. ఈ క్రమంలో రాత్రికి రాత్రే సంఘం బాధ్యులు మారిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి, రెండు సంఘాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుం డా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పేర్లు జిల్లాపరిషత్ (లోకల్‌బాడీస్) జా బితాలో, జిల్లాపరిషత్ ఉపాధ్యాయుల పేర్లు ప్రభుత్వ పాఠశాలల జాబితాలో వచ్చా యి. డీఈఓపై కలెక్టర్ ఆగ్రహం..? ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలపై జిల్లా కలెక్టర్ డీఈఓపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలి సింది. మొన్న మెడికల్ సర్టిఫికెట్లలో ఎలా లోపాలు జరిగాయని ప్రశ్నించినట్లు సమాచా రం. బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రిఫరెన్సియల్ కేటగిరి, సీనియారిటీ జాబితాలను హెచ్ఎంలు, ఎంఈఓల స్థాయిలో మండల కమిటీ, డీఈఓ స్థాయి లో జిల్లా కమిటీలు పరిశీలించిన తర్వాత కూడా ఎలా లోపాలు జరుగుతున్నాయన్నది ఎవరికీ అం దని ప్రశ్న. అన్నీ తప్పులు తెలిసే జరుగుతున్నాయని టీచర్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మెడికల్ సర్టిఫికెట్లలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. 19న ఫైనల్ జాబితా ఉంచుతాం సీనియారిటీ జాబితాలో ఒకటి,అర లోపాలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. 16, 17 తేదీల్లో లోపాలకు సంబంధించిన అప్పీళ్లను స్వీకరిస్తాం.ఇప్పటికే ఎంఈఓలు ఆయా ఎమ్మార్సీల్లో అందుబాటులో ఉంటున్నారు. ఉపాధ్యాయులే ఆన్లైన్ అప్లికేషన్లో చేసిన పొరపాట్ల వల్లే లోపాలు జరిగాయి. వాటి కోసమే రెండ్రోజు లు సమయమిచ్చాం. ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదు. 19న ఫైనల్ జాబితాను వెబ్సైట్లో ఉంచుతాం. - నాంపల్లి రాజేష్, డీఈఓ -
డీఎస్సీకి జాప్యం తప్పదు
హేతుబద్ధీకరణ తర్వాతే ఖాళీలపై స్పష్టత: కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ఆలస్యం తప్పదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సచివాలయంలో టీచర్ల బదిలీల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తయ్యాక ఉపాధ్యాయ ఖాళీలపై లెక్కలు తేలుతాయన్నారు. ఆ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. 1998 నుంచి 2012 వరకు జరిగిన డీఎస్సీలలో మిగిలిపోయిన వారికి ఏ మాత్రం అవకాశమున్నా పోస్టింగులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని పేర్నొన్నారు. దీనిపై ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం అడిగామన్నారు. అభిప్రాయం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ బదిలీలపై పత్రికల్లో వివిధ కథనాలు వస్తున్నాయని, ప్రభుత్వపరంగా ఎలాంటి అక్రమ బదిలీలు చేయలేదని కడియం వివరించారు. విచక్షణాధికారంతో 19 బదిలీలు మాత్రమే చేశామన్నారు. అందులో 16 బదిలీలు జిల్లాల పరిధిలోనే చేశామని చెప్పారు. ఒక బదిలీ మాత్రం హైదరాబాద్ కు, మరొక బదిలీని కరీంనగర్ నుంచి ఖమ్మంకు, ఒక ప్రధానోపాధ్యాయుడిని ఒకే జోన్లో వేరే జిల్లాకు బదిలీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి బదిలీలు చేయలేదని, జిల్లాలో ఇప్పటికే నాన్ లోకల్ కేటగిరీలో కోటాకు మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇకపై రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి బదిలీగానీ, డిప్యుటేషన్గానీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఒత్తిళ్లున్నా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యాశాఖ అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని స్కూళ్లలో టాయిలెట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర ్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనలకు లోబడి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన తర్వాతే ఖాళీ పోస్టులను భర్తీ చే స్తామన్నారు. జీవో 1 ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకే రకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిందేనని, ప్రైవేటు స్కూళ్ల ఇష్ట ప్రకారం ప్రభుత్వం నడవదని కడియం వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని, అమలు చేయకపోతే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రతి స్కూల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టాలని, ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. స్కూల్ ఫీజుల నియంత్రణ విషయంలో కోర్టులో కేసు తేలగానే చర్యలు చేపడతామన్నారు. హేతుబద్ధీకరణ తరువాతే ఆలోచన: కడియం ప్రాథమిక పాఠశాలల్లో 30 మందిలోపు విద్యార్థులు ఉన్న వాటికి అదనపు టీచర్‌ను ఇచ్చే విషయంలో హేతుబద్ధీకరణ, బదిలీల తరువాతే ఆలోచిస్తామని కడియం చెప్పారు. పాఠశాలకు ఒకే టీచర్‌ను ఇచ్చేలా హేతుబద్ధీకరణ ఉత్తర్వులు ఉండడం వల్ల ఆ స్కూళ్లలో ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని కడియం దృష్టికి తీసుకెళ్లగా దీనిపై తరువాత ఆలోచిస్తామని తెలిపారు. రేషనలైజేషన్ పూర్తయ్యాక 30 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లకు టీచర్‌ను ఇవ్వాలా? అకడమిక్ ఇన్స్ట్రక్టర్ను ఇవ్వాలా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.