Ukrainian soldier deciding to record a video: ఉక్రెయిన్‌పై రష్యా భూ, వాయు, జల మార్గాలలో దాడుల చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఆకాశం నుంచి పడుతున్న క్షిపణులు వర్షంతో సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు మాస్కో ప్రారంభించిన దాడిలో సుమారు 137 మంది మరణించారని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపిన సంగతి విధితమే.
మరో వైపు మాస్కో ఏ మాత్రం కనికరం లేకుండా యుద్థ ట్యాంకులు, నౌకదళ నౌకలు, వైమానిక దాడులతో మూడు వైపుల నుండి భయంకరంగా దాడి చేస్తోంది. అంతకంతకు యుద్ధం తీవ్రతరం కావడంతో ఉక్రెయిన్‌లోనూ, ప్రపంచ దేశల్లోనూ అందరిలోనూ ఒకటే తీవ్ర ఉత్కంఠ. అదే సమయంలో ఒక సైనికుడు యుద్ధం చేసేందుకు వెళ్లే కొద్ది నిమిషాల ముందు తన తల్లిదండ్రులకు కలిచివేసే ఒక హృదయవిధారక సందేశాత్మక వీడియోని పంపాడు.
అతను యుద్ధ బీభత్సంతో ఏ క్షణంలో ఏమవుతుందో అనే భావంతో తన తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పేందుకు ఒక వీడియోని రికార్డు చేశాడు . ఈ మేరకు ఆ సైనికుడు వీడియోలో.." మేము తీవ్రమైన బాంబు దాడిలో ఉన్నాము, ఇది మా వంతు. అమ్మా, నాన్న, ఐలవ్ యూ " అంటూ 13 నిమిషాల నిడివిగల సందేశాత్మక వీడియోని పంపాడు. ప్రసతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు కూడా మేము నీకు తెలియకపోవచ్చు మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాం అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు.
A video of a Ukrainian soldier after the shelling appeared on social networks
— fazil Mir (@Fazilmir900) February 24, 2022
Mom, Dad, I love you."
#UkraineRussiaCrisis #Ukraine pic.twitter.com/Itz413EhHU
Comments
Please login to add a commentAdd a comment