Block A Russian Military Convoy: రష్యా ఉక్కెయిన్‌పై భూ, గగన, జల మార్గాల్లో క్షిపణి దాడులతో పశ్చిమ నగరాలను స్వాధీనం చేసుకుంటూ రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని ఒక వ్యక్తి రాజధాని కైవ్‌లోని ప్రవేశిస్తున్న రష్యా సైనిక కాన్వాయ్‌ను ఆపేందుకు యత్నించాడు.
అంతేకాదు రష్యన్ మిలటరీ వాహనాలకు ఎదురుగా నిలబడి మా దేశంలోకి రావద్దు అంటూ చేతులు ఊపుతూ అడ్డంగా నిలుచున్నాడు. పైగా అవి మౌంటెడ్ మెషిన్ గన్‌లతో కూడిన రష్యన్ మిలిటరీ వాహనాలు కానీ ఆ వ్యక్తి ఏ మాత్రం బెదరకుండా అత్యంత తెగువను కనబర్చి వాటి ఎదురు నిలబడి ఆపేందుకు శతవిధాల ప్రయత్నించాడు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణను ఖండిస్తూ..యునైటెడ్ నేషన్స్ నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా శుక్రవారం వీటో చేసిన సంగతి తెలిసిందే.
అయితే రష్యా బలగాలు వైమానిక దాడులతో నగరాలను స్వాధీనం చేసుకుంటూ కైవ్‌లోకి ప్రవేశించడంతో తూర్పు యూరోపియన్ దేశంలోని అధికారులు రాజధాని నగరమైన కైవ్‌ను రక్షించాలని పౌరులను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆ ఉక్రెయిన్ పౌరుడు ఆ రష్యన్ మిలటరీ కాన్వాయ్‌కి ఎదురు నిలుచుని ఆపేందుకు యత్నించాడు.
ఈ ఘటన 1989లో చైనాలో తీసిన "ట్యాంక్ మ్యాన్ ఫోటోని పోలి ఉంది. చైనా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలను హింసాత్మకంగా అణచివేసిన మరుసటి రోజు టియానన్‌మెన్ స్క్వేర్ వద్ద ట్యాంక్‌లను సమీపించే మార్గంలో ఒక వ్యక్తి ఉక్రెయిన్ వ్యక్తి మాదిరే అడ్డంగా నిలుచుని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన 30 నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
✊🏻Українець кидається під ворожу техніку, щоб окупанти не проїхали pic.twitter.com/cZ29kknqhB
— НВ (@tweetsNV) February 25, 2022
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
(చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు! మా దేశాన్ని రక్షించుకుంటాం)
Comments
Please login to add a commentAdd a comment