సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని మిలటరీ శిక్షణ కేంద్రాల్లో పరిశీలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మిలటరీ శిక్షణ, ప్రాధాన్యం, సైన్యం ఎదుర్కొనే సమస్యలు, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న కృషి తదితర అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే 20 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మిలటరీ టూర్ నిర్వహించగా, మరో 200 పాఠశాలల విద్యార్థులకు టూర్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment