పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అవినీతి నిరోధక సంఘం కస్టడీ నుంచి విడుదలైన తర్వాత శనివారం దేశాన్ని ఉద్దేశించిన ప్రసంగంలో పాక్ ఆర్మీపై ఫైర్ అయ్యారు. తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్‌ను అణిచివేసేందుకు సైనిక స్థాపన మొగ్గు చూపుతున్న తీరుపై ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ సైన్య చర్యలు ఇప్పటికే దేశాన్ని విపత్తు అంచుకు తీసుకువచ్చాయని చెప్పారు. ఇక ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తనని కపటుడని అన్న వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావిస్తూ..అలా మాట్లాడినందుకు సిగ్గపడాలి.
నా దేశానికి ప్రాతినిధ్యం వహించి మంచి పేరు తెచ్చకున్నాను. మిలటరీకి చెందిన విభాగం ఐఎస్‌పీఆర్ ఎప్పుడూ ఇలాంటి మాటలు చెప్పలేదన్నారు. అయినా ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు చేసే హక్కు మీకెవరికిచ్చారు. నేను చేసినంతగా సైన్యానికి ఎవరూ హాని చేయలేదని చెప్పడానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడూ ఆర్మీ ఇమేజ్ బాగుందా? ఇప్పుడా అని నిలదీశారు. పాకిస్తాన్‌లో అత్యంత అపఖ్యాతీ పాలైన అవినీతిపరులను అధికారంలోకి తీసుకవచ్చినప్పుడే ఆర్మీ విమర్శలపాలైంది.
ప్రజలు ప్రస్తుతం ఆర్మీ పట్ల అత్యంత అసహనంగా ఉన్నారంటూ పాక్ ఆర్మీపై ఇమ్రాన్‌ఖాన్ పెద్ద ఎత్తున నిప్పులు చెరిగారు. తాను ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నందున ప్రజలు తనను విశ్వసిస్తున్నారని అన్నారు. సుప్రీం కోర్టు సైతం తాను నిజాయితీపరుడనని స్పష్టం చేసిందన్నారు. తన అరెస్టు సమయంలో పాక్ ఆర్మీ పీటీఐ కార్యకర్తలందర్నీ అరెస్టు చేసి జైళ్లలో పెట్టిందన్నారు.
ప్రభుత్వ పార్టీలు ఎన్నికలను కోరుకోవడంలేదని విమర్శించారు. ఎందుకంటే తాము పూర్తిగా తుడిచిపెట్టుకుపోతామని వారికి బాగా తెలసు అంటూ విమర్శలు గుప్పించారు. అందువల్లే తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడి సైనిక స్థావరాలపై దాడి వంటి ప్లాన్‌లు చేశారని ఆరోపణలు చేశారు. ఈ రోజున తమ పార్టీ దారుణంగా అణిచివేతకు గురైందని , ఇలాటి తీవ్ర పరిణమాల వల్ల దేశం ఎటువైపు పయనిస్తుందో సైన్యం కాస్త ఆలోచించాలని సూచించారు. అలాగే తమ పార్టీ హింకు పాల్పడిన చరిత్ర కూడా లేదని నొక్కి చెప్పారు ఇమ్రాన్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment