ఒకవైపు వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చివురుటాకులా వణుకుతోంది. మరోవైపు దేశ భద్రత కోసం తన వంతు సాయంగా ఒక మహిళా లెక్చరర్ ముందుకు వచ్చారు. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న అయిదు మేలు జాతి కుక్కలను సైన్యానికి కానుకగా ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆమెపై సర్వత్రా అభినందనల వెల్లువ కురుస్తోంది.
పేలుడు పదార్ధాలను, మందులను గుర్తించడంలో సైన్యం చూపిస్తున్న తెగువ, చురుకైన పాత్ర తనను ఎంతగానో ఆకట్టుకుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అంతర్జాతీయ ఓపెన్ యూనివర్శిటీలోని లెక్చరర్ డాక్టర్ షిరు విజేమన్నే వెల్లడించారు. సైన్యానికి సాయం అందించే ఉద్దేశంతో ఒకే కుటుంబానికి అయిదు జర్మన్ షెపర్డ్ కుక్కులను సైన్యానికి అందించినట్టు చెప్పారు.
నారాహెన్‌పిటలోని తన నివాసంలో బ్రిగేడియర్ ఎ.ఎ.అమరసకేరాకు అప్పగించారు డాక్టర్ షిరు విజేమన్నే. వీటికి పేలుడు పదార్థాల నిర్మూలన (ఈఓడి), శ్రీలంక ఇంజనీర్స్ (ఎస్ఇఎల్) స్క్వాడ్రన్‌లో కొన్ని వారాల పాటు ప్రత్యేక శిక్షణన ఇవ్వనున్నామని సైన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment